వరి ఆరబెట్టడంలో ఆదర్శం… నందిపేట రైతులు

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల రైతులు వరిపంటను తమ పొలాల్లో కోసిన తర్వాత తేమను తొలగించడానికి ఆరబెట్టడంలో ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా వుంటున్నారు. ఇతర గ్రామాల రైతులలాగా రోడ్లపై గాకుండా ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని ఖుదాన్పూర్‌ గ్రామం నుండి ఆర్మూర్‌ వరకు గల గ్రామాల రైతులు తమ పంట పొలాల్లోని వరిని రోడ్లపై ఆరబెట్టడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిదంగా జోజిపేట్‌ నుండి నిజామాబాద్‌ వరకు గల సుమారు 20 కిలోమీటర్ల పొడవు గల రైతులు ప్రధాన రహదారిపై అడ్డదిడ్డంగా కుప్పలు పోయడంతో ప్రతి రోజు ఎదో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కానీ నందిపేట మండలంలోని మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్‌, నూత్‌పల్లి, తల్వేద, తొండాకూర్‌, బజార్‌ కొత్తూరు, సిహెచ్‌ కొండూరు తదితర గ్రామాల రైతులు తమ గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలను చదునుచేసి టార్పాలిన్‌ కవర్‌వేసి దానిపై ఆరబెడుతున్నారు. అనుకోకుండా వర్షం వస్తే కవర్‌పై ఉన్న ధాన్యం కుప్పలుగా చేసి అదే కవరుతో కప్పివేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here