వరుడు అబ్బాయి కాదు.. వధువు అమ్మాయి కాదు .. అవాక్కయ్యే పెళ్లి ఇది

0
4


వరుడు అబ్బాయి కాదు.. వధువు అమ్మాయి కాదు .. అవాక్కయ్యే పెళ్లి ఇది

ఇది జంబలకిడిపంబ కాదు.. అంతకు మించిన వార్త అని చెప్పక తప్పని పరిస్థితి. సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. సమాజంలో మూడో కేటగిరీగా చూడబడుతున్న ట్రాన్స్ జెండర్లు సైతం పెళ్లి చేసుకుంటారు. కాని ఇద్దరు లింగ మార్పిడి సర్జరీలు చేయించుకున్న వారు ఆడ మగగా , మగ ఆడగా మారిన వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎక్కడా చూసుండరు. ఇక అలాంటి ఘటనే కోల్కతాలో జరిగింది.

అందరినీ అవాక్కయ్యేలా చేసిన పెళ్లి .. కోల్కత్తాలో జరిగిన వింత వెడ్డింగ్

కోల్ కత్తాలో జరిగిన ఓ భిన్నమైన వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఆ జంటను చూసి ఒక్క సారిగా అవాక్కయ్యారు. దానికి కారణం లేకపోలేదు. వివాహం జరిగిన వేళ వరుడు గతంలో అమ్మాయికాగా, వధువు గతంలో అబ్బాయి కావడమే ఈ వివాహం పట్ల అందరూ అవాక్కవటానికి ప్రధాన కారణం. గతంలో ట్రాన్స్ జెండర్ లకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ద్వారా అందరికీ పరిచయమైన తీస్తా దాస్ ఈ వివాహం చేసుకుని షాక్ ఇచ్చారు.

ట్రాన్స్ జెండర్ గా మారిన తీస్తా దాస్ తీసుకున్న నిర్ణయం

ట్రాన్స్ జెండర్ గా మారిన తీస్తా దాస్ తీసుకున్న నిర్ణయం

ఉత్తర కోల్ కత్తా శివార్లలో మహజాతి నగర్ లో పుట్టిన సుశాంతో అనే అబ్బాయి. అయితే పేరుకు మాత్రమే పురుషుడు గా ఉన్నా , అతని ఆలోచనలన్నీ అమ్మాయిగానే ఉండేవి. చిన్నతనంలోనే తనలోని మార్పును గమనించిన సుశాంతో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని తీస్తా దాస్ గా మారాడు. ఆపై బెంగాల్ లో తొలి ట్రాన్స్ జెండర్ ప్రిన్సిపాల్ మనాబి బందోపాధ్యాయ్ ప్రోత్సాహంతో సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ చేయించుకున్నాడు. ఆపై స్త్రీగా మారిపోయాడు. ఈ ఆపరేషన్ చేసిన అప్పు తీర్చలేకపోయిన తీస్తా దాస్ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్యను చేసుకున్నాడు. దీంతో తీస్తా దాస్ గురించి అందరికీ తెలిసింది. ఇక ఆమె తాజాగా పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

అతను ఆమెగా మారి , ఆమె అతనుగా మారిన ఇద్దరూ ఒకటైన పెళ్లి

అతను ఆమెగా మారి , ఆమె అతనుగా మారిన ఇద్దరూ ఒకటైన పెళ్లి

సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ చేయించుకున్న ట్రాన్స్ జెండర్ల పరిస్థితిపై నిర్మితమైన సినిమాలో తీస్తా దాస్ నటించింది. ఆపై అసోంకు చెందిన ఒక అమ్మాయి, తనలో ఉన్న మగ లక్షణాలతో ఇదే తరహా ఆపరేషన్ చేయించుకుని చక్రవర్తిగా మారి, తీస్తాకు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో పడి, పెళ్లాడాలనుకుంటున్నామని, ఏప్రిల్ 15న తమ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ట్రాన్స్ మ్యాన్ ను ఎందుకు చేసుకోవాలని చాలామంది తీస్తా దాస్ ను ప్రశ్నించారు. తీస్తా అవేవి పట్టించుకోకుండా బంధువులు, సన్నిహితుల సమక్షంలో చక్రవర్తి ని వివాహం చేసుకున్నారు. అతను ఆమె లా, ఆమె అతను లా మారిన ఈ జంట వివాహం చూడడానికి వచ్చిన వారంతా ఇదెక్కడి విడ్డూరం అంటూ నోరెళ్లబెట్టారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here