వరుణుడి కోపానికి ముద్దయిన ధాన్యం

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో ఈయేడు పంటలు బాగా పండి ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని అనుకున్న రైతులకు, వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. కాలం పూర్తవుతున్నా అడపా దడపా వానలు పడుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వరి కోతలు కోసం తంటాలు పడుతున్న రైతులకు ధాన్యాన్ని కోసిన తర్వాత మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవకాశం దొరకకపోగా, వరి ధాన్యం మరింత తడిసి ముద్దవుతుంది. దీంతో రైతులు మరింత కుంగిపోతున్నారు. దీంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కోనుగోలు చేయాలని, మద్దతు ధర ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here