వరుసగా 17వ సూపర్-10 సాధించిన నవీన్.. ప్లే ఆఫ్స్‌ నుంచి పుణే ఔట్‌!

0
0


పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో దబంగ్ ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ హవా కొనసాగుతోంది. తనకు అలవాటుగా మారిన సూపర్-10ను నవీన్ కుమార్ మరోసారి సాధించాడు. నవీన్‌కు ఇది వరుసగా 17వ సూపర్-10 కావడం విశేషం. నవీన్ చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో ఢిల్లీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 60-40 తేడాతో పుణెరి పల్టాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

వరణుడి దెబ్బ.. భారత్‌, దక్షిణాఫ్రికా మూడో టీ20 కూడా రద్దు!!

22 సార్లు రైడింగ్‌కు వెళ్లిన నవీన్.. 19 పాయింట్లు సాధించాడు. చంద్రన్‌ రంజిత్‌ 12 పాయింట్లతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించగా.. ట్యాక్లింగ్‌లో రవీందర్‌ పహల్‌ హైఫై (6 పాయింట్ల)తో ఆకట్టుకున్నాడు. పుణే తరఫున నితిన్‌ తోమర్‌, ఇమాద్ చెరో 7 పాయింట్లు సాధించారు. ఇక డిఫెండర్ జాలాసాహెబ్ జాదవ్ 10 ప్రయత్నాల్లో ఆరు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు.

మ్యాచ్ ప్రారంభంలోనే నవీన్ వరుస రైడ్లతో చెలరేగాడు. దీంతో పూణేను ఢిల్లీ ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసి 12-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా నవీన్ జోరు కొనసాగించి పీకేఎల్‌లో ఓవరాల్‌గా 400 పాయింట్లు సాధించి.. ఈ మార్కును వేగంగా దాటిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. పూణే 13వ నిమిషంలో పుణే మరోసారి ఆలౌటైంది. ఇక తొలి అర్ధభాగం ముగిసే సరికి ఢిల్లీ 30-16తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. విరామం అనంతరం కూడా అదే దూకుడు కనబరిచిన ఢిల్లీ.. 20 పాయింట్ల భారీ తేడాతో విజయం సాధించింది. జ్వరం కారణంగా స్టార్ రైడర్ పంకజ్ మోహతే లేని లోటు పూణే జట్టులో స్పష్టంగా కనిపించింది.

ఆదివారం జరిగిన మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 38-37తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై నెగ్గింది. చివరి నిమిషంలో సాధించిన టాకిల్‌ పాయింట్‌తో హరియాణా స్టీలర్స్‌ గట్టెక్కింది. ఈ విజయంతో హరియాణా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. వికాస్‌ కండోలా సూపర్‌ 10తో హరియాణా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ చివరి నిమిషాలు అభిమానుల్లో ఉత్కంఠకు గురిచేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here