వాగులోపడి బాలుడి మృతి

0
2


వాగులోపడి బాలుడి మృతి

మృతిచెందిన బాలుడు

సిరికొండ, న్యూస్‌టుడే: సిరికొండ మండలంలోని సిరికొండ తండాకు చెందిన భూక్య నందేశ్‌(13) వాగులో పడి మృతిచెందినట్లు ధర్పల్లి సీఐ ప్రసాద్‌ తెలిపారు. గురువారం సాయంత్రం తండా సమీపంలోని వాగు ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here