వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలకు ఇక కొత్త పేర్లు..!

0
1


వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలకు ఇక కొత్త పేర్లు..!

హైదరాబాద్ : సోషల్ మీడియా ట్రెండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏ విషయమైనా.. మీడియా కన్నా పవర్‌ఫుల్‌గా మారిన సోషల్ మీడియాలోనే ఎక్కువగా వైరల్ అవుతోంది. స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్ మొదలు.. అరచేతిలోకి ప్రపంచం వచ్చిన దరిమిలా సామాజిక మాధ్యమాల జోరు మరింత పెరిగిందని చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్ల కారణంగా ఏ సమాచారమైనా ఇట్టే సర్క్యులేట్ అవుతోంది. ఆ క్రమంలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం గురించి వేరే చెప్పనక్కర్లేదు. రివల్యూషన్ క్రియేట్ చేశాయనేది అందరికీ తెలిసిందే.

ఫేస్‌బుక్ గ్రూప్‌కు చెందిన ఈ రెండు యాప్‌లు కూడా త్వరలో కొత్త పేర్లతో దర్శనమివ్వనున్నాయి. ఇప్పటిదాకా ఉన్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం పేర్లకు బదులు ఇప్పుడు నయా నేమ్స్ తెరపైకి రానున్నాయి. వాటి పేర్లను సరికొత్తగా మార్చాలని ఫేస్‌బుక్ నిర్వాహకులు నిర్ణయించారు. ఆ క్రమంలో ఇక వాట్సాప్‌కు బదులుగా వాట్సాప్ ఫ్రమ్ ఫేస్‌బుక్‌గా కొత్త పేరు ఖరారు చేశారు. అలాగే ఇన్‌స్టాగ్రాంకు బదులుగా ఇన్‌స్టాగ్రాం ఫ్రమ్ ఫేస్‌బుక్ అని దర్శనమివ్వనుంది. అలాగే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, వెబ్‌సైట్లలోనూ త్వరలో మారిన కొత్త పేర్లే కనిపించనున్నాయి.

అయితే ఈ రెండు యాప్స్ పేరు ఛేంజ్ చేయడానికి కారణాలున్నాయి. ఫేస్‌బుక్ ఎంతోకాలంగా వీటిని నిర్వహిస్తూ వస్తున్నప్పటికీ.. వాటికంటూ సొంత కార్యాలయాలు, ఉద్యోగులు, సిబ్బంది.. అలా అంతా సెటప్ ఉన్నప్పటికీ ఈ యాప్‌లకు స్వతంత్రను తగ్గించాలనేది ఫేస్‌బుక్ అంతరంగంగా కనిపిస్తోంది. అందులోభాగంగానే వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం పేర్లు మార్చనున్నట్లు సమాచారం. మొత్తానికి కొత్త పేర్లు త్వరలోనే మారనున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here