వానలో రైతు బజార్‌

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డెయిలీ మార్కెట్‌ నుంచి కూరగాయల వ్యాపారస్తులను మునిసిపల్‌ ప్రత్యేకాధికారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశాల మేరకు గంజ్‌లోని రైతుబజార్‌కు తరలించారు. రైతుబజార్‌ షెడ్లలో కూరగాయల వ్యాపారస్తులకు అన్నిరకాల ఏర్పాట్లు చేసి అనంతరం మార్కెట్‌ తరలించాల్సి ఉండగా అవేమి చేయకుండా వారిని ఆదర బాదరగా తరలించడంతో వారు గంజ్‌ ప్రాంగణంలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. మంగళవారం భారీగా వర్షం కురియడంతో కూరగాయలన్ని వానకు కొట్టుకుపోయాయి. వానలో నానుతూ చిరువ్యాపారులు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు రైతుబజార్‌పై దృష్టి సారించి వ్యాపారులకు అందులో అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here