వామ్మో ఇస్త్రీపెట్టెల్లో బంగారం.. 3 కోట్ల గోల్డ్ దుబాయ్ టు హైదరాబాద్.. శంషాబాద్‌లో ఫసక్..!

0
1


వామ్మో ఇస్త్రీపెట్టెల్లో బంగారం.. 3 కోట్ల గోల్డ్ దుబాయ్ టు హైదరాబాద్.. శంషాబాద్‌లో ఫసక్..!

హైదరాబాద్‌ : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్దీ గోల్డ్ తెస్తూ అడ్డదారుల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నంలో కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. ఫలితంగా విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కిలోలకొద్దీ బంగారం గుట్టురట్టవుతోంది. అదే క్రమంలో తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9 కిలోల 200 గ్రాముల బంగారం పట్టుబడిన తీరు చర్చానీయాంశంగా మారింది. దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా విలువచేసే బంగారాన్ని సదరు ప్రయాణీకుడు తీసుకొచ్చిన వైనం హాట్ టాపికయింది.

కస్టమ్స్ అధికారులకు ప్రయాణీకుడి షాక్..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం నాడు కస్టమ్స్ అధికారులకే కళ్లు తిరిగిపోయేలా ఓ ప్రయాణీకుడు షాకిచ్చాడు. అతడి నుంచి 9 కిలోల 200 గ్రాముల బంగారం పట్టుబడటం విస్తుపోయేలా చేసంది. సదరు ప్రయాణీకుడి తెలివితేటల పప్పులు కస్టమ్స్ అధికారుల ఎదుట ఉడకలేదు. దాంతో సీన్ రివర్సయి అడ్డంగా దొరికిపోయాడు. ఎంతో తెలివిగా వ్యవహరించి అంత పెద్దమొత్తంలో బంగారం తీసుకొచ్చి చివరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు చిక్కడం గమనార్హం.

చాకచక్యంగా.. చివరకు చిక్కాడిలా..!

చాకచక్యంగా.. చివరకు చిక్కాడిలా..!

దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఓ ప్రయాణీకుడు శంషాబాద్‌లో అనుమానస్పదంగా కనిపించాడు. అతడి వ్యవహారశైలిని ఇట్టే పసిగట్టిన కస్టమ్స్ అధికారులు ఓ చూపు చూశారు. ఇంకేముంది సదరు ప్రయాణీకుడు అడ్డంగా బుక్కయ్యాడు. అతడిపై అనుమానంతో బ్యాగేజీ సోదా చేస్తే కస్టమ్స్ అధికారుల కళ్లు బైర్లు కమ్మే విషయం బయటపడింది. ఎంతో చాకచక్యంగా ఏకంగా తొమ్మిది కిలోల రెండు వందల గ్రాముల బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా తీసుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.

4 ఐరన్ బాక్సులు.. 9.2 కిలోల బంగారం కడ్డీలు

4 ఐరన్ బాక్సులు.. 9.2 కిలోల బంగారం కడ్డీలు

ఆ ప్రయాణీకుడి తెలివి చూసి కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి వస్తూ వస్తూ అతడు అంత పెద్దమొత్తంలో చాలా ఈజీగా గోల్డ్ తనవెంట తీసుకురావడం అంతుచిక్కని ప్రశ్న. దుబాయ్ నుంచి వచ్చిన సదరు ప్రయాణీకుడు ఎంత తెలివిగా వ్యహరించినా.. చివరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల కళ్లకు చిక్కక తప్పలేదు.

నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో 9 కిలోల 200 గ్రాముల బంగారాన్ని నీట్‌గా సర్దేశాడు. ఎంతలా అంటే తాను ఎట్టిపరిస్థితుల్లో చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే అతడి తీరుపై అనుమానం వచ్చి తనిఖీలు చేస్తే అసలు విషయం బయటపడింది. నాలుగు ఐరన్ బాక్సుల్లో అంత బంగారం మహా బాగా పట్టించేశాడు. 4 ఇస్త్రీ పెట్టెల్లో నాలుగు బంగారు కడ్డీలు బయటపడటం గమనార్హం.

వేడెక్కే లోహం తొలగించి.. ఆ ప్లేస్‌లో బంగారం కడ్డీలు

వేడెక్కే లోహం తొలగించి.. ఆ ప్లేస్‌లో బంగారం కడ్డీలు

హైదరాబాద్‌కు చెందిన సదరు ప్రయాణీకుడు దుబాయ్ వెళ్లి తిరిగొచ్చే క్రమంలో తన వెంట 9.2 కిలోల బంగారం తీసుకొచ్చాడు. నాలుగు ఐరన్ బాక్సుల్లో వాటిని సెట్ చేశాడు. ఇస్త్రీ పెట్టెల్లోని వేడెక్కే లోహం తొలగించి సేమ్ అదే షేపులో (V shape) బంగారు కడ్డీలను అమర్చాడు. ఒక్కో కడ్డీని 2 కిలోల 300 గ్రాముల వెయిట్‌తో తయారు చేయించాడు. అంతేకాదు వాటికి సిల్వర్ కోట్ వేయించాడు. ఒకవేళ కస్టమ్స్ అధికారులకు దొరికి ఆ ఇస్త్రీ పెట్టెలను విప్పినా.. సిల్వర్ కలర్ ఉండటంతో గుర్తుపట్టబోరని భావించాడు. కానీ ఆ ఎత్తుగడ చిత్తయింది.

ఒకేసారి నాలుగు ఐరన్ బాక్సులు.. అక్కడే తేడా కొట్టిందిగా..!

ఒకేసారి నాలుగు ఐరన్ బాక్సులు.. అక్కడే తేడా కొట్టిందిగా..!

9 కిలోల 200 గ్రాముల బంగారాన్ని కరిగించి నాలుగు భాగాలుగా చేశాడు. వాటిని ఇస్త్రీ పెట్టెల్లోని వేడెక్కే లోహం పలకల మాదిరిగా తీర్చిదిద్దాడు. వీ షేపులో వాటిని తయారుచేసి లోపల బిగించాడు. సాధారణంగా దుబాయ్ నుంచి తెచ్చే ఇస్త్రీ పెట్టెలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువుంటాయి. అయితే సదరు ప్రయాణీకుడు ఒక్కో ఇస్త్రీ పెట్టెలో 2 కిలోల 300 గ్రాములున్న వీ షేప్ బంగారం కడ్డీ అమర్చాడు. దాంతో ఐరన్ బాక్స్ బరువు అమాంతం పెరిగినట్లైంది. అంతేకాదు ఒకేసారి నాలుగు ఇస్త్రీ పెట్టెలు తేవడం కూడా కస్టమ్స్ అధికారులకు అనుమానం తెప్పించినట్టుంది.

మొత్తానికి 3 కోట్లకు పైగా విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అదలావుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇప్పటివరకు 40 కిలోల వరకు బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here