వామ్మో.. ఎంత లావు నల్ల తాచో, కాటేస్తే కాటికే!

0
2


చిన్న పామును చూసినా ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది బాగా బలిసిన తాచుపాము కళ్ల ముందు ప్రత్యక్షమైతే? ఇంకేమైనా ఉందా.. దాన్ని చూడగానే గుండె ఆగిపోతుంది కదూ. అరుదైన వన్య ప్రాణులకు కేంద్రమైన ఆస్ట్రేలియాలో ఇలాంటి పాములకు కొదవే లేదు. తాజాగా బ్రిస్బేన్‌లో కనిపించిన ఓ నల్లని తాచుపాము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read also: ఫోన్ మాట్లాడుతూ పాములపై కూర్చున్న మహిళ, కాటు వేయడంతో..

5 అడుగుల 9 ఇంచుల పొడవైన ఈ నల్ల తాచును చూడగానే కొండ చిలువ ఏమో అనుకుంటారు. దాని భయంకరమైన రూపం చూస్తే.. అది భూగ్రహానికి చెందినదేనా అని అనుమానం కలగక మానదు. దాని రంగు, ఆకారం చూస్తే గుండె దడ పెరుగుతుంది. బ్రిస్బెన్‌కు చెందిన ఓ స్నేక్ క్యాచర్ (పాములను పట్టుకొనే వ్యక్తి) ఈ తాచు పాము ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ ఫొటోను 2,700 మంది షేర్ చేసుకున్నారు. ఈ పాము చూసేందుకు నల్లగా ఉన్నా.. పొట్ట భాగం ఎర్రగా ఉంటుందని, దీన్ని బెల్‌మాంట్‌లో పట్టుకున్నానని చెప్పాడు.

Read also: కుక్కకు ఆహారంగా రేపిస్టు అంగం.. అతడిని కొరుక్కుని తింటుంటే వీడియో!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here