వామ్మో.. కాళ్లతో ఆటో నడుపుతూ వెనుక చక్రం మార్చిన డ్రైవర్

0
4


వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మరు. బహుశా.. ప్రపంచంలో మరెవ్వరూ ఇంత సాహసం చేసి ఉండరేమో అనిపిస్తుంది. ఓ పక్క ఆటోను నడుపుతూనే.. మరో పక్క ఆటో వెనుక చక్రాన్ని మార్చడం అంటే అసాధ్యమైన పని. కానీ, ఆ ఆటో డ్రైవర్.. దాన్ని సుసాధ్యం చేశాడు. కాళ్లతో ఆటో హ్యాండిల్ పట్టుకుని.. చేతులతో వెనుక చక్రాన్ని తీసి బిగించేశాడు.

Read also: కోడి గుడ్లు పేలి ఆసుపత్రిపాలైన యువతి.. ఆ పొరపాటే కొంప ముంచింది

ఈ ఘటన ఎప్పుడు జరిగిందో.. ఎక్కడ జరిగిందో తెలీదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా దూసుకెళ్తోంది. ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేసిన ఈ వీడియోను ఒక్క రోజు వ్యవధిలో 56 వేల మంది వీక్షించారు. ‘‘ఎన్నోసార్లు టైర్లు మార్చడం చూశాను. ఇది మాత్రం జేమ్స్‌ బాండ్ స్టైల్’’ అని ఆయన ఈ వీడియోను షేర్ చేశారు.

వీడియో:

ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటోను మెలికలు తిప్పుతూ రెండు చక్రాలు(ముందు చక్రం, ఎడమ చక్రం)పై వాల్చాడు. ఆ తర్వాత కుడి వైపు చక్రం బోల్డులు విప్పాడు. మరో ఆటోలో వచ్చిన యువకుడు అతడి వద్ద టైరు తీసుకుని మరో టైరు అందించాడు. దీంతో అతడు ఆ టైరును ఆటోకు బిగించడం కనిపించింది. ఈ సందర్భంగా ఎవరెవరు ఎమంటున్నాదనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.

Read also: ఆకలితో తనని తానే తినేయబోయిన పాము.. వీడియో వైరల్

‘‘ఓరి దేవుడో.. ఈ విధంటా టైరు మార్చడం చాలా టెరిఫిక్‌గా ఉంది. నిజంగా ఇది జేమ్స్ బాండ్ స్టైలే’’

‘‘పబ్లిక్ ప్రాంతాల్లో ఇలాంటి స్టంట్లు చేయడాన్ని ఖండించాలి. అది ఇతరుల ప్రాణాలు తీయొచ్చు’’

‘‘మైండ్ బ్లోయింగ్. టైర్లు మార్చేందుకు ఎఫ్1 రేసింగ్ కార్లనైనా కొన్ని సెకన్లు ఆపాలి’’

ముఖ్య గమనిక: ఈ వీడియోలో ఉన్న స్టంట్ చాలా ప్రమాదకరమైనది. దయచేసి ఎవరూ ప్రయత్నించవద్దని మనవి. ఇలాంటి స్టంట్లు ప్రజలు తిరిగే ప్రాంతాల్లో చేయడం మరింత ప్రమాదకరం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here