వామ్మో.. స్కూల్ చెట్లపై హైటెన్షన్ వైర్లు, విద్యుత్ షాక్‌నకు గురైన విద్యార్థులు

0
9


వామ్మో.. స్కూల్ చెట్లపై హైటెన్షన్ వైర్లు, విద్యుత్ షాక్‌నకు గురైన విద్యార్థులు

గోరఖ్‌పూర్ : స్థానిక అధికారుల అలసత్వం.. ఆ స్కూల్‌ విద్యార్థుల పాలిట శాఫమైంది. పాఠశాల చెట్లపై హైటెన్షన్ వైర్లు పడి .. గ్రౌండ్‌లోకి పవర్ సప్లై అయ్యింది. అయితే అప్పటికే గ్రౌండ్‌లో విద్యార్థులు ఉండటంతో వారి పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడారు. తమ ప్రాంతలో హైటెన్షన్ వైర్లు పడ్డాయని విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా స్పందిచలేదని టీచర్లు చెప్తున్నారు. ఈ ఘోర ఘటనలో దాదాపు 51 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

స్కూల్‌కెళ్తే ..

యూపీలోని బలరామ్‌పూర్ నారాయణ్‌నగర్ ఓ ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే పాఠశాల విశాలంగా ఉండటమే వారి పాలిట శాపంగా మారింది. పెద్ద గ్రౌండ్ ఉంది. దానికితోడు చెట్లు కూడా ఉండటం వారిని ప్రమాదానికి గురిచేసింది. సోమవారం పాఠశాలలోని చెట్లపై విద్యుత్ హైటెన్షన్ వైర్లు పడ్డాయి. అయితే దానిని ఎవరూ గమనించలేదు. ఉదయం 10 గంటలు అవుతుంది. అందరూ విద్యార్థులు వచ్చారు. షూ తిప్పేసి .. తాడుబొంతపై కూర్చొన్నారు విద్యార్థులు. దీంతో ఒక్కొక్కరికి కరెంట్ షాక్ తగిలింది. అయితే అప్పటికే అక్కడ ఉన్న టీచర్లు చెప్పులు వేసుకోవడంతో వారు కరెంట్ షాక్ బారి నుంచి తప్పించుకోగలిగారు. అయితే విద్యార్థులను చూసి షాక్‌నకు గురయ్యామని టీచర్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కోరినా .. 15 నిమిషాల వరకు ఎవరూ స్పందించలేదని టీచర్లు ఆరోపిస్తున్నారు.

వెంటనే విద్యార్థులను ఉత్రౌలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారిలో 22 మందిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరెంట్ షాక్ తగిలిన విద్యార్థులకు ప్రాణాపాయం ఏమీ లేదని జిల్లా కలెక్టర్ క‌ృష్ణ తెలిపారు. ఆ సమయంలో విద్యుత్ ఆపాల్సి ఉన్న .. సరఫరా చేసినందుకు లైన్‌మెన్‌పై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. అతన్ని విధుల నుంచి తప్పించామని పేర్కొన్నారు. జూనియర్ సివిల్ ఇంజినీర్ ప్రియదర్శిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here