‘వాల్మీకి’ ఉన్మాదం.. ఆగస్టు 15న పిచ్చెక్కిస్తాడట!

0
0


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ప్రీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో వరుణ్ కిల్లింగ్ లుక్‌ను చూసి సినీ ప్రేమికులు వహ్వా అన్నారు. ఈ ప్రీ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమాను సెప్టెంబర్ 13న చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల కోసం వరుణ్ తేజ్ తీపి కబురు అందించారు.

Also Read: ‘సాహో’ థియేట్రికల్ రైట్స్.. ‘రంగస్థలం’ కలెక్షన్స్‌ను మించి!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘వాల్మీకి’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు వరుణ్ తేజ్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘మరో రెండు రోజుల్లో ఉన్మాదం మొదలైపోతుంది. ‘వాల్మీకి’ టీజర్ కోసం వేచి చూస్తూ ఉండండి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఆగస్టు 15న అల్లు అర్జున్ 19వ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద ఈ ఆగస్టు 15న మెగా అభిమానులు స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు వీటిని కూడా ఎంజాయ్ చేయనున్నారు.

‘వాల్మీకి’ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here