‘వాల్మీకి’ వచ్చేస్తున్నాడు.. గన్స్ లోడ్ చేసుకోండి!!

0
3


కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తోన్న హీరో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ‘ముకుంద‌’, ‘కంచె’, ‘అంత‌రిక్ష్యం’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ‌’, ‘ఎఫ్‌2’ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడీ యువ క‌థానాయ‌కుడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు విరుద్ధంగా మరో వైవిధ్యమైన చిత్రంలో వరుణ్ నటిస్తున్నారు. ఆ చిత్రమే ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ప్రీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో వరుణ్ కిల్లింగ్ లుక్‌ను చూసి సినీ ప్రేమికులు వహ్వా అన్నారు. ఈ ప్రీ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల కోసం వరుణ్ తేజ్ తీపి కబురు అందించారు. సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here