వావ్.. విమానం చుట్టూ ఇంద్రధనస్సు, ఈ అద్భుత దృశ్యానికి కారణం ఇదే!

0
2


విమానంలో వెళ్తున్న ఓ ప్రయాణికుడు కిటికీ నుంచి బయటకు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విమానంతోపాటే సమానంగా మరో విమానం వేగంగా దూసుకెళ్లడం చూశాడు. అంతేకాదు, దాని చుట్టూ వృత్తాకారంలో అల్లుకున్న అందమైన ఇంద్రధనస్సును చూసి మరింత థ్రిల్ అయ్యాడు. వెంటనే తన మొబైల్ కెమేరా ఆన్ చేసి ఆ అద్భుత దృశ్యాన్ని బంధించాడు.

Read also: భర్తకు 47 మంది పిల్లలు.. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తెలిసిన నిజం!

చైనా గగనతలంలో కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు ఆ దేశ సోషల్ మీడియా వెబ్‌సైట్ Weibo‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసినవారంతా ఆ విమానం చుట్టూ వృత్తాకార ఇంద్రధనస్సు ఎలా ఏర్పడిందని ఆశ్చర్యపోతున్నారు. దాన్ని చూస్తే ఆ విమాన్నాన్ని ఇంద్రధనస్సులో బంధించారనే భ్రమ కలుగుతుంది.

వీడియో:

కారణం ఏమిటంటే..: గ్వంగ్స్యూ నుంచి బీజింగ్‌కు వెళ్తున్నప్పుడు ఈ దృశ్యం కనిపించిందని ఈ వీడియో తీసిన ప్రయాణికుడు తెలిపాడు. వాస్తవానికి అది భ్రమ మాత్రమే. దీన్నే దృష్టిభ్రాంతి (optical illusion) అని కూడా అంటారు. దీనిపై చైనా వాతావరణ విభాగం ఇంజినీర్ బియన్ మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం దృష్టిభ్రాంతి మాత్రమే. అక్కడ ఇంద్ర ధనస్సు మధ్యలో కనిపిస్తున్నది విమానం కాదు. ఈ వీడియో తీస్తున్న ప్రయాణికుడి విమానం నీడే మేఘాలపై పడి మరో విమానంలా కనిపించింది. అలాగే, విమానంపై పడిన కాంతి కిరణాలు వక్రీకరణ చెంది ఆ వృత్తాకార ఇంద్రధనస్సు ఏర్పడింది. అతడు కూర్చున్న చోట నుంచి ఆ నీడ, ఇంధ్రదనస్సుల కలిసిన దృశ్యం కనిపించింది. మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి కనిపిస్తుంటాయి’’ అని తెలిపారు.

Read also: తలనొప్పితో గతం మరిచిన మహిళ.. పెళ్లికాలేదంటూ భర్తకు షాక్!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here