వాహనం దగ్ధం

0
2


వాహనం దగ్ధం


మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ఆర్మూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామ శివారులో సోమవారం ట్రాలీ ఆటోలో మంటలు చెలరేగి దగ్ధమైంది. యజమాని బాలాజీ తన వాహనంలో ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌కు 44వ నంబరు జాతీయ రహదారిపై వెళ్తుండగా చేపూర్‌ శివారులో ఆటో బ్యాటరీ నుంచి పొగలు వచ్చి మంటలు లేచాయి. దీంతో బాధితుడు ఆర్మూర్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పారు. ఈ ఘటనలో రూ. 90 వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు ఆర్మూర్‌ అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీశైలం తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/137604.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here