వాహనం బోల్తా: భక్తులకు గాయాలు

0
7


వాహనం బోల్తా: భక్తులకు గాయాలు


బోల్తా పడిన తుపాన్‌ వాహనం

బడాపహాడ్‌, (వర్ని), న్యూస్‌టుడే: వర్ని మండలంలోని బడాపహాడ్‌ సయ్యద్‌ హజరత్‌ షాదుల్లా బాబా దర్గాను దర్శించుకుని వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని బడాబడా గ్రామానికి చెందిన ఒక కుటుంబ సభ్యులు దర్గాను దర్శించుకోవడానికి తుపాన్‌ వాహనంలో వచ్చారు. దర్శనం చేసుకుని వెళ్తుండగా పులిక్యాంప్‌ సమీపంలోని మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, భక్తులు బోల్తా పడిన వాహనంలోని భక్తులను బయటకు తీశారు. ప్రైవేటు వాహనాలల్లో చికిత్స నిమిత్తం బోధన్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్సై అనీల్‌రెడ్డిని వివరణ కోరగా ప్రమాదం జరిగినా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/126665.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here