వాహనదారులకు గుడ్ న్యూస్: మరింత వేగంగా బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్

0
1


వాహనదారులకు గుడ్ న్యూస్: మరింత వేగంగా బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్

వాహన దారులకు శుభవార్త. రానున్న కాలంలో వాహనాలకు సంబంధించిన బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత వేగంగా జరగనుంది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని బీమా రంగం నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ పరిమితిని పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇది 50,000 రూపాయలు ఉంది. దీన్ని 75,000 రూపాయలకు పెంచారు. ఒకవేళ మోటార్ యాక్సిడెంట్ అయితే కస్టమర్ ఈ పరిధి మేరకు సొంతంగానే డిక్లరేషన్ చేయవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్సు సెర్వేయర్స్, లాస్ అసెసర్స్ రేగులేషన్స్ కు సవరణలను ప్రతిపాదించింది.

నాన్ మోటార్ క్లెయిమ్స్ పరిమితి రూ.1.5 లక్షలు

నాన్ మోటార్ క్లెయిమ్స్ కు సంభందించిన సెల్ఫ్ డిక్లేర్ పరిమితిని 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయలకు పెంచారు. ఇది అగ్ని ప్రమాదం, గృహం, మెరైన్, ఇంజినీరింగ్, ఇతర బీమా క్లెయింలకు వర్తిస్తుంది.

వేగంగా క్లెయిమ్స్ సెటిల్మెంట్

వేగంగా క్లెయిమ్స్ సెటిల్మెంట్

* చిన్న క్లెయిమ్ లకు సంభందించిన క్లైముల పరిమితిని పెంచడం వల్ల బీమా తీసుకున్న కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. వేగవంతంగా బీమా క్లెయిమ్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిపాదిత పరిమితి మేరకు కస్టమర్ చేసుకునే క్లెయిమ్ ను కంపెనీలు సెర్వేయర్ల, లాస్ అసేస్సర్ల అవసరం లేకుండానే క్లైములను సెటిల్ చేస్తాయి. ఒకవేళ ఈ పరిమితి దాటితే మాత్రం బీమా సర్వేయర్ మదింపు చేసిన తర్వాతనే చెల్లింపులు చేస్తారు. చిన్న మొత్తాల్లో ఉండే క్లెయిమ్ లను శరవేగంగా చెల్లించడానికి అవకాశం ఉంటుందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.

* ప్రస్తుతం బీమా కంపెనీలు తమ మొబైల్ యాప్ ల ద్వారా కృత్రిమ మేధను వినియోగించి క్లెయిమ్ లను అస్సెస్ చేస్తున్నాయి. వారి అసెస్మెంట్ ను బట్టి చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ సులభతరంగా ఉన్న నేపథ్యంలో క్లెయిమ్ పరిమితిని పెంచాలని ఐ ఆర్ డీ ఏ ఐ ప్రతిపాదించింది.

* సెల్ఫ్ అసెస్మెంట్ లో భాగంగా పాలసీ తీసుకున్న వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో వాహనానికి జరిగిన నష్టం గురించి వీడియో తీసి కంపెనీలకు పంపుతున్నారు. అంతే కాకుండా వాహనానికి చేపట్టిన మరమ్మతుల ప్రూఫ్ లను అందించడం జరుగుతోంది. ఇలాంటి వాటి ఆధారంగా బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ జరుగుతోంది. అయితే కొన్ని కంపెనీలు క్లెయిమ్ సెటిల్ మెంట్ కోసం ప్రయివేట్ సర్వీస్ కేంద్రాలతోను చేతులు కలుపుతున్నాయి.

సర్వేయర్ల నివేదికతో జాప్యం...

సర్వేయర్ల నివేదికతో జాప్యం…

* ప్రస్తుతం అమల్లో ఉన్న ఇన్సూరెన్సు క్లెయిమ్ మేరకు సర్వేయర్ అవసరము ఉండదు కానీ ఆ పరిమితి దాటితే మాత్రం సెర్వెవేయర్ ను కంపెనీలు నియమిస్తాయి. వీళ్ళు నష్టాన్ని మదింపు చేసి నివేదికను కంపెనీకి సమర్పించడానికి దాదాపు నెల రోజులు పడుతుంది. బీమా కంపెనీలు ఈ నివేదికను సమీక్షించిన తర్వాతనే క్లెయిమ్ లను సెటిల్ చేస్తాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here