వాహనాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిందే

0
0


వాహనాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిందే

ప్రోగ్రాం మేనేజర్‌ భూమా నాగేందర్‌

సమావేశంలో మాట్లాడుతున్న ప్రోగ్రామ్‌ మేనేజర్‌ భూమా నాగేందర్‌

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని అయిదు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్‌ భూమా నాగేందర్‌ స్పష్టం చేశారు. ‘కుయ్‌..కుయ్‌..కుర్రో మొర్రో’ అనే శీర్షికతో జిల్లాలో 108 వాహనాల పరిస్థితిపై ‘ఈనాడు’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు చెందిన 108, 102, 1962 వాహనాల జిల్లా అధికారులతో గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సమీక్షించారు. అంబులెన్సుల పనితీరు, అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తర్వాత వాహనం వీలైనంత వేగంగా ఘటన స్థలికి చేరేలా చూడాలని చెప్పారు. సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అధికారులు కొండల్‌రావు, దుర్గయ్య, సంపత్‌, గంగ విష్ణు, సాయి ప్రణీత్‌రెడ్డి, భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here