విండిస్ Vs భారత్, 1st ODI: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి!

0
0


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రస్తుత వరల్డ్ టీ20 ఛాంపియన్స్‌గా ఉన్న వెస్టిండిస్‌ను ఆరు టీ20ల్లో వరుసగా ఓడించిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫోకస్ వన్డే సిరిస్‌కు మళ్లింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో గుయానా వేదికగా గురువారం ప్రారంభం కానుంది.

మళ్లీ మొదటికొచ్చిన No. 4 సమస్య: కేఎల్ రాహుల్ ఖాయమైనట్టేనా?

ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి టీ20 సిరీస్‌లో అంచనాల్ని మించి రాణించిన టీమిండియా… అదే ఉత్సాహంలో కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ధావన్ కొనసాగుతున్నాడు.

రోహిత్ Vs గేల్: ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో, కొత్త విషయం వెలుగులోకి!

శిఖర్ ధావన్ ఇప్పటివరకు మొత్తం 130 వన్డేలు ఆడి 17 సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో వెస్టిండిస్‌తో వన్డే సిరిస్‌లో శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో కేఎల్ రాహుల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేకి సంబంధించిన సమాచారం మీకోసం…

వెస్టిండిస్ Vs టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ఏరోజు జరుగుతుంది?

ఆగస్టు 8, 2019(గురువారం)

వెస్టిండిస్ Vs టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ప్రొవిడెన్స్ స్టేడియం, గుయానా

వెస్టిండిస్ Vs టీమిండియా తొలి వన్డే మ్యాచ్ టైమింగ్?

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం

చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!

వెస్టిండిస్ Vs టీమిండియా తొలి వన్డే మ్యాచ్‌ని ఏయే ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి?

సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్

వెస్టిండిస్ Vs టీమిండియా తొలి వన్డే మ్యాచ్‌ ఆన్‌లైన్‌ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ వీక్షించొచ్చు?

SonyLIVSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here