విండీస్‌తో మూడో వన్డే.. కోహ్లీకి గాయం!!

0
1


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి గాయం అయింది. అయితే తొలి టెస్ట్ వరకు గాయం తగ్గే సూచనలు ఉండడంతో ఆ టెస్టుకు అందుబాటులో ఉంటానని స్వయంగా కోహ్లీనే తెలిపాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ గాయపడ్డాడు. లక్ష్య ఛేదనలో విండీస్ బౌలర్ కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లీ కుడి చేతి వేలికి గాయమైంది. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చేసిన అనంతరం తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీ (114; 99 బంతుల్లో 14×4) చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఈ దశాబ్దంలో 20వేల పరుగులు చేసిన కోహ్లీ.. పాంటింగ్‌ రికార్డును బద్దలు

 గాయం చిన్నదే:

గాయం చిన్నదే:

కోహ్లీకి గాయం కావడంతో విండీస్‌తో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.దీనిపై కోహ్లీ స్పందించాడు. ‘ప్రస్తుతం చేతి వేలు బాగానే ఉంది. బంతి బలంగా తాకినా.. అదృష్టవశాత్తూ ఫ్రాక్చర్‌ కాలేదు. చికిత్స అనంతరం నొప్పి లేకపోవడంతో బ్యాటింగ్‌ కొనసాగించా. ఒకవేళ ఫ్రాక్చర్‌ అయ్యుంటే బ్యాటింగ్‌ చేయలేకపోయేవాడిని. గాయం చిన్నదే. ఎలాంటి ఆందోళన అనవసరం. తొలి టెస్టు ఆడుతా’ అని కోహ్లీ స్పష్టం చేసాడు.

ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు:

ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు:

విండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కెరీర్‌లో 42వ సెంచరీ అందుకుని ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. కోహ్లీ ఈ పదేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు చేసిన కోహ్లీ.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పాంటింగ్‌ 18,962 పరుగులతో దశాబ్దంలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జాక్వెస్ కలిస్‌ (16,777), మహేళ జయవర్ధనే (16,304), కుమార సంగక్కర (15,999)లు వరుసగా ఉన్నారు. సచిన్‌ టెందూల్కర్‌ (15,962) ఆరో స్థానంలో ఉన్నాడు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంఎస్ ధోనీ

రెండో కెప్టెన్‌గా:

రెండో కెప్టెన్‌గా:

వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. వన్డే కెప్టెన్‌గా కోహ్లీ 21 సెంచరీలు చేసాడు. రికీ పాంటింగ్‌ 22 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక విండీస్‌ పర్యటనలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లీ ఘనత సాధించాడు. విండీస్‌ పర్యటనలో కోహ్లీకి ఇది నాలుగు వన్డే సెంచరీ. ఆసీస్ మాజీ ఓపెనర్ హేడెన్‌ మూడు శతకాలు చేసి ద్వితీయ స్థానంలో ఉన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here