విజయారెడ్డికి సంతాపంగా మీ-సేవ కేంద్రాల బంద్‌

0
0


విజయారెడ్డికి సంతాపంగా మీ-సేవ కేంద్రాల బంద్‌

బాల్కొండ: తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకు నిరసనగా బాల్కొండ, ముక్కాల్‌, మెండోర మండలాల్లోని మీ-సేవ కేంద్రాల ఆపరేటర్లు కేంద్రాలను మూసి వేయించి బంద్‌ పాటించారు. ఈ దాడిని ఖండిస్తూ వారు బాల్కొండ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద విజయారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. బాల్కొండలో తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు కార్యాలయానికి తాళం వేసి సేవలు నిలిపివేశారు. బాల్కొండ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఘోరమైన చర్యగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here