విజయ్ దేవరకొండకి మెసేజ్ చేస్తే రెండేళ్ల తరువాత కనిపించమన్నాడు: హరీష్ శంకర్

0
4


‘గద్దలకొండ గణేష్ (వాల్మీకి)’ చిత్రంతో దర్శకుడు హరీష్ శంకర్ మరో మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక వివాదాల నడుమ శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడుదలై మిశ్రమ స్పందనను రాబట్టింది.

మెగా హీరోలందరితో పాటు ఎన్టీఆర్, రవితేజలో పనిచేసిన టాలెంటెడ్ దర్శకుడు హరీష్.. విజయ్ దేవరకొండపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం టాలీవుడ్ హీరోల గురించి మీ అభిప్రాయం చెప్పమని కోరడంతో ఒక్కో హీరో గురించి ఒక్కో వాక్యంలో సమాధానం ఇచ్చారు.

‘ఎన్టీఆర్‌‌లో సింగల్ టేక్ ఆర్టిస్ట్.. ఆయనలో నచ్చనది టైం అంటే టైం. షూటింగ్‌ 8 గంటలంటే పది నిమిషాలు ముందు వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ ఒక ఆరా.. ఆయనలో నచ్చనిది ఆయన సినిమాలు చేయననటం. మెగాస్టార్ చిరంజీవి అంటే కింగ్ ఆఫ్ సినిమా. ఇంకో చిరంజీవి పుడతారని అనుకోను. చిరంజీవితో అవకాశం వస్తే.. దొంగమొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలనే చేస్తా.

విజయ్ దేవరకొండ.. యూత్ ఐకాన్. అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్‌కి కథ చెబుదాం ఒకసారి కలుద్దాం అని మెసేజ్ పెట్టా. అన్నా.. నేను ఏడాదిన్నర- రెండేళ్ల వరకూ బిజీగా ఉన్నాను. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం అని మెసేజ్ పెట్టాడు. సినిమా టాపిక్‌ కాకపోతే నీతో నాకు పనేం ఉంటుంది భయ్యా.. ఏడాదిన్నర తరువాతే కలుద్దాం అని నేను రిప్లై ఇచ్చా. అతని గురించి నెగిటివ్ చెప్పాలంటే.. అతను విమర్శను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. మన పని మనం చూసుకుని వెళిపోతే సరిపోద్ది.

నాని వెరీ ఎక్స్‌ప్రెసివ్… రవితేజ నా లైఫ్. ఆయన లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను. జీవితం పట్ల, సినిమా పట్ల ఫుల్ క్లారిటీతో ఉంటాడు. రవితేజలో నెగిటివ్ అని చెప్పలేం. రామ్ చరణ్.. పవర్ హౌస్‌ లాంటి వాడు. చిరుతలో చూసిన చరణ్‌కి రంగస్థలంలో చరణ్‌కి చాలా తేడా ఉంది. ఇన్‌స్పిరేషన్ అతను. సాయి ధరమ్ తేజ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అతనితో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని షాట్‌లలో అలా చిరు వచ్చి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. వరుణ్ తేజ్.. ప్యాన్ ఇండియా కటౌట్’ అంటూ చెప్పుకొచ్చారు హరీష్.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here