విడిగా ఓన్ డ్యామేజ్ బీమా… వాహనదారులకు ఎంతో ప్రయోజనం

0
3


విడిగా ఓన్ డ్యామేజ్ బీమా… వాహనదారులకు ఎంతో ప్రయోజనం

ఈ రోజుల్లో కొత్త, పాత వాహనం ఏది కొనుగోలు చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ఇంధన ధరలు, వాహన బీమా ప్రీమియం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోతోందనే చెప్పాలి. వాహన ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా తప్పనిసరిగా మారిపోయింది. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వేరుగా ఓన్ డ్యామేజ్ (ఓడీ) బీమా కవరేజీని తీసుకునే సదుపాయాన్ని తీసుకురావాలని బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలే ఆదేశాలు ఇవ్వడం వాహనదారులకు ఎంతో ఊరట కలిగించే అంశం. దీని ప్రకారం బీమా కంపెనీలు విడిగా థర్డ్ పార్టీ (టీపీ) బీమాను, ఓడి బీమాను జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఈ కంపెనీలు వీటిని కలిపి అమ్ముతున్నాయి. వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వాహన యజమానులు విడిగా ఓడి కవరేజి బీమాను తీసుకునే అవకాశం ఉంటుంది.

ఓడీ తో అవకాశం

* వాహనం దొంగతనానికి గురైనా, ఏదైనా డ్యామేజీ జరిగినా బీమా పరిహారాన్ని పొందడానికి ఓడీ తో అవకాశం ఉంటుంది.

* ప్రకృతి విపత్తులైన తుఫానులు, భూకంపాలు, వరదలు వంటివి సంభవించినప్పుడు లేదా వ్యక్తుల ద్వారా జరిగే విధ్వంసాలు, అల్లర్లు, ఉగ్రవాదుల దాడులు వంటివాటివల్ల వాహనానికి నష్టం జరిగినప్పుడు డ్యామేజీ కవరేజీని పొందవచ్చు.

* వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. థర్డ్ పార్టీకి ఏదైనా ప్రమాదం లేదా నష్టం జరిగినప్పుడు ఈ బీమా ద్వారా పరిహారం అందుతుంది. ఇప్పటిదాకా మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో థర్డ్ పార్టీ బీమా ఇస్తున్నారు. టీపీ, ఓడీ ని కలిపి చాలా బీమా కంపెనీలు విక్రయిస్తున్నాయి.

ఇకపై ఇలా ....

ఇకపై ఇలా ….

* సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఓడీని వేరేగా వార్షిక పాలసీగా బీమా కంపెనీలు విక్రయించనున్నాయి.

* బీమా కంపెనీలు ఓడీ, టీపీని తప్పనిసరిగా కలపరాదు.

* వాహనదారులు టీపీ ని ఒక కంపెనీ నుంచి ఓడీని మరో కంపెనీ నుంచి కొనుగోలు చేయవచ్చు.

* టీపీ కవర్ ను ఓడీ పాలసీలు సూచించాల్సి ఉంటుంది.

* దీర్ఘ కాలిక ఓడీకి అవకాశం కల్పించలేదు. అంటే ఏడాదికి ఒకసారి దీని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.

* థర్డ్ పార్టీ బీమాను సుప్రీమ్ కోర్టు తప్పని సరి చేసింది. అయితే ఇప్పటివరకు ఓడీ తప్పనిసరి ఏమి కాదు.

ప్రయోజనం

ప్రయోజనం

* వాహన దారుడు తనకు నచ్చిన కంపెనీ నుంచి ఓడీ కవరేజీని తీసుకోవచ్చు.

* దీనివల్ల కొత్త కస్టమర్లను సంపాదించు కోవడానికి కంపెనీలు విభిన్న రకాల కవరేజీలతో ముందుకువచ్చే అవకాశం ఉంటుంది.

* బీమా కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది కాబట్టి మంచి ధరలో బీమాను పొందడానికి వాహనదారులకు అవకాశం లభిస్తుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here