విడుదలైన రోజు ఇంట్లోనే సినిమా: జియో గిగా దెబ్బతో వారికి వణుకు!!

0
0


విడుదలైన రోజు ఇంట్లోనే సినిమా: జియో గిగా దెబ్బతో వారికి వణుకు!!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ సోమవారం (ఆగస్ట్ 12) సంచలన ప్రకటన చేశారు. జియో First Day First Show (ఫస్ట్ డే ఫస్ట్ షో) ఆఫర్ ద్వారా ఏదైనా సినిమా థియేటర్‌లో విడుదలైన రోజునే చూడవచ్చు. రిలయన్స్ గిగా ఫైబర్ అందిస్తున్న ఈ ఆఫర్ యూజర్లకు లాభదాయకమే. అయితే సినిమా పరిశ్రమకు, అలాగే టీవీ పరిశ్రమకు, ప్రకటనకర్తల పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమపై పడే ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ల కంటే మరో ముందడుగు

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సినిమా విడుదలైన నలభై రోజులకు చూసే వెసులుబాటు ఉంది. సినిమా బాగుందంటే థియేటర్లో చూస్తారు. పరవాలేదు లేదా బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్‌లో వచ్చినప్పుడు చూద్దాంలే అని భావించేవారు ఎందరో. ఇప్పుడు రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసి థియేటర్లో విడుదలైన రోజునే గిగా ఫైబర్ ద్వారా కూడా సినిమాను చూసే అవకాశాన్ని 2020 మధ్యలో తీసుకు వస్తామని వెల్లడించారు.

సినిమాకు మౌత్ టాక్

సినిమాకు మౌత్ టాక్

ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్‌కు రావడం తగ్గించారు. ఇప్పుడు సినిమా విడుదలైన రోజునే చూసే పరిస్థితి వస్తే ఆ సినిమా భవితవ్యం వెంటనే తేలిపోతుందని చెబుతున్నారు. సినిమాల భవితవ్యం ఇప్పటికే మౌత్ టాక్ పైన ఆధారపడి ఉంటోంది. థియేటర్లో విడుదలైన రోజే జియో గిగాలో వస్తే ఆ సినిమా పరిస్థితి మరింతగా తేటతెల్లమవుతుంది.

వీరి పైనే దెబ్బ

వీరి పైనే దెబ్బ

అంతేకాదు, మొదటి రోజునే సినిమా చూసే అవకాశం వస్తే ప్రేక్షకుడు థియేటర్‌కు ఏమేరకు వస్తాడనేది ప్రశ్నే. జియో ఫైబర్ ప్లాన్ అమలు చేస్తే సినిమా రంగంలో కీలకమైన పంపిణీదారుల వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. జియో ఫైబర్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌పై దెబ్బ పడుతుందంటున్నారు. సినిమా హాల్ యజమానులు, కేబుల్ ఆపరేటర్లు, DTH ఆపరేటర్లపై కూడా ఈ ప్రభావం పడుతుందని, వారికి జియో గిగా ఫైబర్ ఆందోళన కలిగించే విషయమే అంటున్నారు. వారాంతంలో సినిమాలు ప్రసారం చేసే టీవీ ఛానల్స్‌కు ఇబ్బందికర పరిణామమే అంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here