విత్తన విలాపం

0
3


విత్తన విలాపం

అత్తెసరు విత్తనోత్పత్తి

వర్షాలతో దెబ్బతిన్న పంట

నిలిచిపోయిన సేకరణ

ముఖం చాటేసిన కంపెనీలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

మొలకెత్తిన ధాన్యాన్ని తీస్తున్న మహిళా రైతు

యవసాయ విత్తనోత్పత్తికి అనుకూలమైన జిల్లాలో వర్షాలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌తోపాటు పదుల సంఖ్యలో ప్రైవేటు కంపెనీలు రైతులతో వివిధ వంగడాల విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. పది రోజులుగా కురుస్తున్న వానలతో కోత దశలో పంటలు దెబ్బతిన్నాయి. గింజ రంగు మారింది. పంట తీసుకునేందుకు కంపెనీలు విముఖత చూపుతున్నాయి. రైతులు దళారులకు అడిగినంత ధరకు అమ్ముకోక తప్పడం లేదు.

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా అంతటా 4.40 లక్షల ఎకరాల్లో పంటలు వేేశారు. అందులో సుమారు 25 వేల ఎకరాల్లో వివిధ కంపెనీలు బ్రీడర్‌, ఫౌండేషన్‌ విత్తనాన్ని రైతులకు ఇచ్చి వేయించారు. ఆర్మూర్‌ డివిజన్‌లోనే 20 వేల ఎకరాల్లో పండుతోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ పంటలు వేశారు. ఇవన్నీ ఇప్పుడు నూర్పిడి దశలో ఉన్నాయి. పది రోజులైతే పంట ఇంటికొస్తుందనగా వర్షాలు పడటంతో నేల వాలింది. విత్తనోత్పత్తి కోసం కావడంతో ఏ మాత్రం రంగు మారినా, గింజ పూర్తిగా పరిపక్వత చెందకున్నా సేకరణకు కష్టమవుతుంది. ఈ మేరకు ఆయా కంపెనీలు కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నాయి.

అ‘ధనం’.. మధనం

సాధారణ సాగు(మార్కెటింగ్‌) కంటే విత్తనోత్పత్తి(ప్రొడక్షన్‌) చేస్తే సంస్థలు అదనంగా 20 నుంచి 30 శాతం ధర ఇస్తారు. ఇదే సాగుదారులను ఆకర్షిస్తోంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ గిట్టుబాటవుతుందనే ఆశ విత్తనోత్పత్తి వైపు మళ్లిస్తోంది. ప్రతికూల వాతావరణం, విత్తన స్వచ్ఛత లోపిస్తే మాత్రం అసలుకే ఎసరొస్తుంది. అటు కంపెనీలు తీసుకోక, ఇటు బయట అమ్ముకోలేక అవస్థలు పడాలి. వరుసగా కురిసిన వానలతో సుమారు ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అందులో తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ సంస్థదే 950 ఎకరాలు.

మెండోరా మండలం బుస్సాపూర్‌ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నోముల శ్రీనివాస్‌రెడ్ఢి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన సోయా పంటను ఎకరంన్నరలో వేశారు. నూర్పిడి దశలో గింజ దెబ్బతినిందని కొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. చేసేది లేక తక్కువ ధరకు బయట అమ్ముకోవాల్సి వస్తోంది.

ఈయన పేరు గంగారెడ్ఢి ఆర్మూర్‌ మండలం అలూరు గ్రామానికి చెందిన ఈ రైతు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన వరి విత్తనాలను ఐదెకరాల్లో పండించారు. కోత సమయంలో పడిన వర్షానికి గింజ బాగాలేదని ఆ సంస్థ చెప్పడంతో ఎకరాకు రూ.పది వేల వరకు నష్టపోవాల్సి వచ్చింది.

ఈ రైతు పేరు రొండ్ల నర్సారెడ్ఢి ధర్పల్లి మండలం వాడి గ్రామం. విత్తనోత్పత్తి కోసం తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ వారి వరి వంగడాన్ని విత్తారు. పంటంతా వర్షం తాకిడికి నేల వాలింది. చేతికొచ్చేదాక నమ్మకం లేదు. కంటికి రెప్పలా కాపాడి పండించింది కళ్ల ముందే నష్టపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here