విదేశీ పర్యటనకు స్పీకర్‌

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అధికారిక విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న కామన్వెల్త్‌ దేశాల 64వ స్పీకర్ల సమావేశంలో పాల్గొనడానికి బుధవారం తెల్లవారుజామున శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. కామన్వెల్త్‌ దేశాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్న అనంతరం యూరప్‌ లో పర్యటిస్తారు. అనంతరం అక్టోబర్‌ 6 న పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వస్తారు. శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు కూడా స్పీకర్‌ వెంట అధికారిక పర్యటనలో పాల్గొంటారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here