విద్యారంగ సంక్షేమమే ఏబీవీపీ ధ్యేయం

0
0


విద్యారంగ సంక్షేమమే ఏబీవీపీ ధ్యేయం

సమావేశంలో మాట్లాడుతున్న నిరంజన్‌

పద్మాజివాడి (సదాశివనగర్‌) న్యూస్‌టుడే: విద్యారంగ సంక్షేమమే ఏబీవీపీ ధ్యేయమని తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి జమలాపూర్‌ నిరంజన్‌ అన్నారు. పద్మాజివాడి శివారులోని స్ప్రింగ్‌ ఫీల్డ్స్‌ ఉన్నత పాఠశాలలో ఏబీవీపీ ఇందూరు విభాగం అభ్యాస వర్గ శిక్షణ తరగతులకు శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఏబీవీపీ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. ఈ శిక్షణకు ఇందూరు, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన 200 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రాంత సహ సంఘటన కార్యదర్శి సాయిబాబా, ఇందూరు విభాగ్‌ ప్రముఖ్‌ రెంజర్ల నరేష్‌, కామారెడ్డి జిల్లా ప్రముఖ్‌ గిరిబాబు, ప్రతినిధులు రణజిత్‌ మోహన్‌, స్వామి, రవీందర్‌రెడ్డి, మనోజ్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here