విద్యార్థులకు భరోసా కల్పించాలి

0
1


విద్యార్థులకు భరోసా కల్పించాలి


సిబ్బందితో సమావేశమైన డీఐఈవో ఒడ్డెన్న

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఎంతో నమ్మకంతో వస్తున్న విద్యార్థులకు భరోసా కల్పించేలా విద్యనందించాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న సూచించారు. బోధన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అకడమిక్‌, పాలనా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్జెక్టు వారీగా విద్యార్థుల ప్రగతి, ప్రవేశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమాచారలేమితో తడబడిన అధ్యాపకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు నమ్మి కళాశాలకు వస్తున్నప్పుడు భరోసా కల్పించాలన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎంత మంది విద్యార్థులున్నారు, వారి ప్రగతి ఎలా ఉందన్న విషయం ఎప్పటికప్పుడు గమనిస్తే అందరూ ఉత్తీర్ణులవుతారని పేర్కొన్నారు. ప్రతి కళాశాలలోనూ ఇదే విధానం అనుసరించేలా కమిటీ పనిచేస్తుందని చెప్పారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి మెరుగు కోసం ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట కమిటీ సభ్యులు సుఖేందర్‌రెడ్డి, చంద్రవిఠల్‌, గురువారెడ్డి ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here