విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం బాల్కొండలో ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను నైపుణ్యాభివద్ధికై వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ సంస్థ దత్తత తీసుకుంది. కార్యక్రమానికి జిల్లా ఇంటర్‌ మీడియేట్‌ విద్యాధికారి ఒడ్డెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లా లో అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు దిశా నిర్ధేశం చెయ్యాలని సంస్థ నిర్వాహకులను కోరారు. అనంతరం లక్ష్య సాధన అనే అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి శిక్షణ నిచ్చారు. లక్ష్యాన్నీ ఏర్పరుచు కోవడం, నిర్ధేశిత సమయంలో సాధించడం, లక్ష్య సాధన మార్గాలు, ఉన్నతంగా ఎదగడం అనే అంశాలను నేర్పించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. కళాశాలలో ప్రతి నెల ఒక కార్యక్రమం నిర్వహించటంతో పాటు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కళాశాలలో ఉన్నత ప్రతిభ గల విద్యార్థులకు ప్రశంస పత్రాలు, విద్యార్థులకు లక్ష్య సాధన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా కో ఆర్డినెటర్‌ తక్కూరి హన్మాండ్లు, ప్రిన్సిపాల్‌ అర్గుల చిన్నయ్య, అధ్యాపకులు గంగారాం, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here