విద్యార్థుల ఐడీ కార్డులపై సెక్స్ హాట్‌లైన్ నెంబర్, స్కూల్‌లో గోల గోల

0
0


విద్యార్థులు ధరించి గుర్తింపు కార్డులపై స్కూల్ యాజమాన్యం సెక్స్ హాట్‌లైన్ నెంబరును ప్రచురించడంతో గందరగోళం నెలకొంది. లాస్ ఏంజిల్స్‌లోని లాంకాస్టర్‌లోని న్యూ విస్టా మిడిల్ స్కూల్ చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్థులకు అందించే ఐడీ కార్డులపై స్కూల్ యాజమాన్యం ఆత్మహత్యల నివారణ సంస్థకు సంబంధించిన హాట్‌లైన్ నెంబరును ప్రచురించాలని భావించింది. అయితే, ఆ సంస్థ నెంబరుకు బదులుగా ఓ సెక్స్ హాట్‌లైన్ నెంబరును వాటిపై ప్రచురించారు. అనంతరం వాటిని విద్యార్థులకు అందించారు.

Also Read: రైలులో బరి తెగించిన జంట .. నిఘా కెమేరాకు చిక్కిన పాడుపని

విద్యార్థుల తల్లిదండ్రులు ఆ నెంబరును గుర్తించి స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఐడీ కార్డుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి నిరసన వ్యక్తం చేశారు. స్కూల్‌లో సెక్స్‌ హాట్ నెంబరును ఎవరు వాడుతున్నారు? అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు? అంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో స్కూల్ సిబ్బంది పరుగులు పెట్టారు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. ఆ ఐడీ కార్డులను వెనక్కి తీసుకొని కొత్తవి ముద్రిస్తామని పేర్కొన్నారు.

Also Read: కొడుకు పక్కలో శిశువు ఆత్మ.. భర్త తప్పిదంతో భార్య హడల్, చివరికి..Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here