విద్యుత్తు తీగలు తగిలి విద్యార్థికి గాయాలు

0
2


విద్యుత్తు తీగలు తగిలి విద్యార్థికి గాయాలు

నిజామాబాద్: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యుత్తు కరెంటు తీగలు తగిలి విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలం తుమ్ పల్లి గ్రామానికి చెందిన సింహాద్రి అనే ఐదో తరగతి విద్యార్థి డిచ్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. గత మూడు రోజుల క్రితం పాఠశాల ఆవరణలో వేలాడుతున్న విద్యుత్తు వైర్లు తగిలి సింహాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. 60 శాతం గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు విద్యార్థి బంధువులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here