విద్యుత్తు బకాయిలు రూ.298.57 కోట్లు

0
2


విద్యుత్తు బకాయిలు రూ.298.57 కోట్లు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల వారీగా రూ.298.57 కోట్ల విద్యుత్తు బకాయిలు పేరుకుపోయాయని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ నుంచి జులై 24 వరకు రూ.57 కోట్లు వసూలు కావల్సి ఉండగా.. కేవలం రూ.19 కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. వినియోగదారులు స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. 0-101 యూనిట్ల విద్యుత్తు ఉపయోగించే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు కుల ధ్రువపత్రాలు అందజేసి ప్రభుత్వ రాయితీని పొందాలని సూచించారు.

https://betagallery.eenadu.net/htmlfiles/132074.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here