విధి నిర్వహణలో ఆదర్శంగా నిలవాలి

0
2


విధి నిర్వహణలో ఆదర్శంగా నిలవాలి

యువనేస్తం శిక్షణకు సహకరించిన భాగ్యకిరణ్‌ను
సన్మానిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన నూతన ఉద్యోగార్థుల అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరు పనిలోనే ఆనందం వెతుక్కోవాలన్నారు. జిల్లా యువత పోలీసుశాఖలో ఉద్యోగాలు సాధించడానికి కృషి చేశారని ఎస్పీ శ్వేతను ఆయన అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కష్టపడిన వారికి గుర్తింపు తప్పకుండా లభిస్తుందన్నారు. జిల్లాలో యువనేస్తం కార్యక్రమం ద్వారా 420 మందికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కలెక్టర్‌ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. అందులో శిక్షణ తీసుకున్న 42 మంది ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా తమ మూలాలు మరువొద్దన్నారు. అనంతరం యువనేస్తం శిక్షణకు సహకరించిన భాగ్యకిరణ్‌ను శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. పోలీసు అధికారులు నర్సింగ్‌రావు, ఫణి, సుభాష్‌, నరేష్‌రెడ్డి, రాజు, దాదాగౌడ్‌, రవి తదితరులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన 33 మంది కానిస్టేబుళ్లు, ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు, ఒక ఆర్‌ఆర్‌టీ, ఆర్‌పీఎఫ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here