విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎండీ

0
3


విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎండీ

విద్యుత్తు ఉపకేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఎండీ గోపాల్‌రావు

బోధన్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతు కుటుంబాలు చాలా వరకు విద్యుత్తు శాఖ అందించే సేవలపై ఆధారపడి ఉన్నాయని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు. శుక్రవారం బోధన్‌లోని విద్యుత్తు ఉప కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ కొనసాగుతున్న మరమ్మతులు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. ఆయన వెంట డీఈఈ హరిచంద్‌, తదితరులు ఉన్నారు.

వారోత్సవాల్లో అందరూ పాల్గొనాలి

నిజామాబాద్‌ అర్బన్‌ : విద్యుత్తు సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహించనున్న వారోత్సవాలలో సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని సీఎండీ గోపాల్‌ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్తు శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 9 నుంచి 15 వరకు విద్యుత్తు వారోత్సవాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. విద్యుత్తు చౌర్యంపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ సంధ్యారాణి, సీజీఎం మధుసూదన్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here