విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్‌వో

0
1


విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్‌వో

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి సుదర్శనం

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేంది లేదని, వైద్య సిబ్బంది తీరు మార్చుకోకుంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా వైద్యాధికారి సుదర్శనం హెచ్చరించారు. సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ బుద్దె సావిత్రి అధ్యక్షతన గురువారం ఆస్పత్రి సలహా సంఘ సమావేశం నిర్వహించారు. సమయపాలన పాటించడం లేదని, ప్రసవాల సేవలు సక్రమంగా అందటం లేదని ఎంపీపీ సమావేశంలో ప్రస్తావించారు. ఇక్కడ సరైన వైద్య సేవలు అందకపోవడంతో రోగులు బోధన్‌ ప్రాంతీయ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కనీసం ప్రాథమిక వైద్యసేవలు సమర్థంగా అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యధికారులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు. అన్ని స్థాయిల్లోని సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ప్రసవాల సంఖ్య పెంపొందించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో ఉప వైద్యాధికారి విద్య, వైద్యులు మధుసూదన్‌, రేఖ, విండో ఛైర్మన్‌ రాజేశ్వర్‌, సిబ్బంది కిరణ్‌, సుమతి, వినయ్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here