విధి నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించాలి

0
1


విధి నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించాలి

లింబారెడ్డికి ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్పీ శ్వేత

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ శ్వేత పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ పోలీసులు, లైజన్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు శనివారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. నిందితులకు శిక్ష పడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కోర్టు డ్యూటీ పోలీసులు వీటిపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఏడాది కాలంలో జిల్లాలో ఐదుగురికి జీవితఖైదు శిక్ష పడడంలో తమ వంతు కృషి చేసిన పరిశోధన, కోర్టు డ్యూటీ, లైజన్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఎస్పీ అభినందించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వైద్య అమృత్‌రావు, సుదర్శన్‌రెడ్డి, కిషన్‌, కోర్టు లైజన్‌ అధికారి లింబారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారులు సాయిలు, రమేష్‌, దేవీచంద్‌, ఖలీంలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆగస్టులో ఉత్తమ ప్రతిభకనబరిచిన సదాశివనగర్‌, మాచారెడ్డి, గాంధారి, బిచ్కుంద, కామారెడ్డి, భిక్కనూరు, బాన్సువాడ, లింగంపేట పోలీసుస్టేషన్ల అధికారులు, రిసెప్షనిస్టులు, రైటర్‌లు, సీసీటీఎన్‌ఎస్‌ ఆపరేటర్‌, బ్లూకోల్ట్‌, పెట్రోలింగ్‌ అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కామారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు లక్ష్మీనారాయణ, యాదగిరి, శిక్షణ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, జిల్లాల్లోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here