విధుల్లో చేరింది ఐదుగురే

0
1


విధుల్లో చేరింది ఐదుగురే

బాన్సువాడ గ్రామీణం : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల్లో మంగళవారం నాటికి ఐదుగురు ఉద్యోగులు చేరారు. కామారెడ్డికి చెందిన డ్రైవర్‌ హైమద్‌ రెండు రోజుల క్రితమే విధులకు వెళ్లారు. మంగళవారం నిజామాబాద్‌ డిపో-2లో కండక్టర్‌ సంతోష్‌ కుమార్‌, అదే డిపోలో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ జేఎస్‌ రెడ్డిలు విధులకు హాజరయ్యారు. నిజామాబాద్‌లోని ఆర్‌ఎం కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ సూపరింటెండెంట్‌ శ్రీలలిత కలెక్టర్‌ కార్యాలయంలో చేరారు. బాన్సువాడ డిపోలో పనిచేసే కండక్టర్‌ ఉదయ్‌కిరణ్‌ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో విధులకు హాజరయ్యారు.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here