వినియోగించిన వంట నూనెతో బయో డీజిల్

0
0


వినియోగించిన వంట నూనెతో బయో డీజిల్

వినియోగించిన వంట నూనెను బయో డీజిల్ గా మార్చి దానిని వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియంలు వినియోగించిన వంటనూనెలతో తయారు చేసే బయో డీజిల్ ను సమీకరించనున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఈ పనిని చేపట్టే పథకాన్ని శనివారంనాడు ఈ మూడు దిగ్గజ కంపెనీలు ప్రారంభించాయి.

ఈ పథకాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఈ పథకం కింద వినియోగించిన ఆయిల్ నుంచి బయో డీజిల్ ను తయారు చేసే ప్లాంట్ల ను ఏర్పాటు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రయివేట్ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు ఆహ్వానిస్తాయి. ఈ సంస్థలు ఉత్పత్తి చేసే బయో డీజిల్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ . 51 చెల్లించి కొనుగోలు చేయడానికి హామీ ఇస్తాయి. రెండో ఏడాదిలో ఈ ధరను 52.7 కు , మూడో ఏడాదిలో 54. 5 కు పెంచుతారు.

రీ పర్పస్ యూజ్డ్ ఆయిల్ స్టికర్ ను, వినియోగించిన వంట నూనెను సమీకరణకు దోహద పడే మొబైల్ ఫోన్ అప్లికేషన్ ను కూడా విడుదల చేశారు. వినియోగించిన వంట నూనెను బయో డీజిల్ ఉత్తత్తి కోసం సరఫరా చేస్తున్నట్టు తెలిసే విధంగా ఫుడ్ జెయింట్స్, హోటళ్లు , రెస్టారెంట్లు తమ ప్రాంగణాల్లో రీ పర్పస్ యూజ్డ్ ఆయిల్ స్టికర్ ను అంటిస్తారు.

ప్రధాన్ ఏమన్నారంటే..

* బయో డీజిల్ వినియోగించిన వంట నూనె లు కాకుండా అనేక రూపాల్లో అందుబాటులో ఉంది. ఇది వృధానుంచి సంపదను అందిస్తుంది. ప్రపంచ బయో ఇంధన దినోత్సవాన్ని.. ప్రత్యామ్నాయ ఇంధన దినోత్సవంగా జరుపుకుంటాం అన్నారు.

* నాలుగైదేళ్ల క్రితం పెట్రోల్లో ఇథనాల్ ను కలపాలని నిర్ణయించాం. ఇది 1.5 శాతం నుంచి 7-8 శాతానికి పెరిగింది. ఇది 10 శాతానికి పెరిగే అవకాశం ఉంది. రానున్న కాలంలో దీన్ని 20 శాతానికి పెంచాలన్నది లక్ష్యం అని ప్రధాన్ తెలిపారు.

* ప్రస్తుతం మన దేశంలో నెలకు 850 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. 2030 నాటికి డీజిల్ లో బయో డీజిల్ వాటాను 5 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఏడాదిలో 500 కోట్ల లీటర్ల బయో డీజిల్ అవసరం ఉంటుంది.

* మన దేశంలో 2,700 కోట్ల లీటర్ల వంట నూనెలను వినియోగిస్తున్నారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు , క్యాంటీన్ల నుంచి దాదాపు 140 లీటర్ల వినియోగించిన వంట నూనెను సమీకరించ వచ్చని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఏడాదికి 110 కోట్ల లీటర్ల బయో డీజిల్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here