విరాట్ కోహ్లీని తొలగిస్తారా?: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్సీ మార్పు!

0
3


హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీలో ఎలాంటి మార్పు ఉండబోదని ఇటీవలే ఆ జట్టు క్రికెట్‌కు డైరెక్టర్‌గా ఎంపికైన మైక్ హెస్సెన్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ఇప్పటివరకు టైటిల్‌ను నెగ్గలేదు.

ఏడు సీజన్లపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ సైతం ఆ జట్టుకు టైటిల్‌ను అందించలేకపోయాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెటర్లతో పాటు ఆర్సీబీ అభిమానులు సైతం సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.

ఒంటిచేత్తో మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్.. కోహ్లీ, ధావన్ ఎలా ఆశ్చర్యపోయారో చూడండి!! (వీడియో)

ఈ నేపథ్యంలో ఇటీవలే ఆర్సీబీ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమింపబడ్డ మైక్ హెస్సన్ మాట్లాడుతూ “కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే ఆలోచన లేదు. గత తప్పుల నుంచి నేర్చుకుని అతడు ముందుకు సాగుతున్నాడు. గత కొన్ని వారాలుగా జరుగుతున్న చర్చల్లో కోహ్లీ కెప్టెన్సీపై ఎలాంటి సందేహాం లేదు” అని అన్నాడు.

“నా అనుభవం నుండి సలహాలను తీసుకునేందుకు విరాట్ కోహ్లీ చాలా సంతోషంగా ఉన్నాడు. విజయ్ హాజారే, ముస్తాక్ అలీ ట్రోఫీలలో ఆడుతున్న యువ ఆటగాళ్లను పరిశీలిస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒత్తిడి సమయాల్లో నిలకడగా రాణించడం ఎంతో ముఖ్యం” అని హెస్సన్ తెలిపాడు.

ఆటగాళ్లను ఎన్నుకునే ముందు స్థిరమైన ప్రదర్శనలను పరిగణించాల్సిన అవసరం ఉందని… ఒక భారీ ఇన్నింగ్స్ ఎంతమాత్రం కాదని హెస్సన్ అంగీకరించాడు. “ఫామ్ అనేది కీలకం. అయితే, యువ ఆటగాళ్ల టాలెంట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మేము నాలుగేళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటాం” అని మైక్ హెస్సన్ అన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here