విలీన గ్రామాలకు నిధుల వరద

0
2


విలీన గ్రామాలకు నిధుల వరద

రూ. 26.85 కోట్లు మంజూరు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌


ముబారక్‌నగర్‌లో రహదారి పరిస్థితి ఇది

 

నిజామాబాద్‌ నగర పాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల్లో పలు రకాల అభివృద్ధి పనులకు మోక్షం కలిగింది. తొమ్మిది గ్రామాలకు రూ. 26.85 కోట్ల నిధులకు మంజూరు ఇస్తూ మున్సిపల్‌ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తాజాగా జీవో జారీ చేశారు.

గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో నిర్ణయం తీసుకుంది. చుట్టు పక్కల ఉండే బోర్గాం(పి), పాంగ్రా, గూపన్‌పల్లి, ముబారక్‌నగర్‌, మానిక్‌భండార్‌, బోర్గాం(కె), కాలూరు, ఖానాపూర్‌, సారంగపూర్‌ గ్రామాలు నగరంలోకి విలీనం అయ్యాయి. గత అయిదు నెలల నుంచి ఆయా చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ, మంచి నీటి సరఫరాతో పాటు ప్రజలకు కావల్సిన అవసరాలను నగర పాలక సంస్థ అధికారులు చూస్తున్నారు.

ఇక్కడ ఇలా..

పాలక వర్గం లేకపోవడంతో ఒక్కో గ్రామానికి ఒకరిని నోడల్‌ అధికారిగా నియమించారు. గ్రామాల్లో సరైన మౌలిక వసతులు లేక స్థానికంగా ఉండే వారు ఇబ్బందులు పడుతున్నారు. అధ్వానమైన రహదారులు, మురుగు కాల్వలు దర్శనం ఇస్తున్నాయి. సమస్యలతో సతమతం అవుతున్న తరుణంలో పలు రకాల పనులకు నిధులు కేటాయించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులకు ఖర్చు

తెలంగాణ అర్బన్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా విలీన గ్రామాలకు రూ. 26.85 కోట్ల నిధులను కేటాయించింది. రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం, ఉద్యానం ఏర్పాటు, సామాజిక భవనాల నిర్మాణం వంటి వాటి కోసం ఈ నిధులను తొమ్మిది గ్రామాల్లో ఖర్చు చేస్తారు. వచ్చిన నిధులను గ్రామాలకు సమానంగా ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధులను ఖర్చు చేయనున్నారు. నిధుల జారీకీ జీవో ఇచ్చిన ఉన్నతాధికారులు త్వరలోనే దానికి సాంకేతిక మంజూరు ఇచ్చిన తర్వాత టెండర్లను పిలువనున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు పనుల జాబితా తయారు చేస్తున్నారు.


ఖానాపూర్‌లో అధ్వానంగా మురుగు కాల్వ

పక్కాగా పనులు చేపడతాం

జాన్‌ సాంసన్‌, కమిషనర్‌, నగర పాలక సంస్థ

కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చిన తొమ్మిది గ్రామాల్లో పలు రకాల పనుల కోసం నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. అవసరమైన చోట ఈ నిధులను వెచ్చిస్తాం. పనులను గుర్తించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించాం. త్వరలోనే టెండర్లను నిర్వహించి ప్రతి పని కూడా పక్కగా చేపడుతాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here