విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం

0
2


విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: మున్సిపల్‌లో విలీనమైన గ్రామాలకు ఎల్‌ఆర్‌ఎస్‌(లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)కు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. గ్రామాల్లో నాన్‌ లేవుట్‌ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకున్న వారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 2018 మార్చి 30లోపు రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతించారు. దరఖాస్తులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటారో ఇంకా ప్రకటించలేదు. వీటిపై త్వరలోనే ఆదేశాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఈ గ్రామాలకు వరిస్తాయి

నిజామాబాద్‌ కార్పొరేషన్‌: సారంగపూర్‌, కాలూరు, ఖానాపూర్‌, ముబారక్‌నగర్‌, గూపన్‌పల్లి, పాంగ్రా, బోర్గాం(పి), బోర్గాం(కె), మానిక్‌బండార్‌

బోధన్‌: శ్రీనివాసనగర్‌, ఆచన్‌పల్లి

ఆర్మూర్‌: కోటార్మూర్‌(పెర్కిట్‌), మామిడిపల్లి

బాన్సువాడ: కొయ్యగుట్ట, వాసవికాలనీ, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, హనుమాన్‌కాలనీ, 2బీహెచ్‌కే కాలనీ

కామారెడ్డి: అడ్లూర్‌, దేవునిపల్లి, లింగాపూర్‌, పాత రాజంపేట్‌, రామేశ్వర్‌పల్లి, సారంపల్లి, టేక్రియాల్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here