వివేక్ మొదలెట్టేశాడు .. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటంలో కేసీఆర్ దే కీలక పాత్రట!!

0
0


వివేక్ మొదలెట్టేశాడు .. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటంలో కేసీఆర్ దే కీలక పాత్రట!!

  వివేక్ మొదలెట్టేశాడు || Former MP Vivek Sensational Comments On KCR

  పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడటం మొదలెట్టేశాడు. టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నమ్మించి ద్రోహం చేయడంలో సీఎం కేసీఆర్‌ది ఫస్ట్ ప్లేస్ అని బీజేపీ నేత జి.వివేక్‌ ఆరోపణలు గుప్పించారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న తరువాత వివేక్,అటు టిఆర్ఎస్ నుండి, ఇటు కాంగ్రెస్ నుండి అసంతృప్తులను బిజెపిలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు .

  నమ్మించి మోసం చెయ్యటంలో కేసీఆర్ ది మొదటి స్థానం అన్న వివేక్

  నమ్మించి మోసం చెయ్యటంలో కేసీఆర్ ది మొదటి స్థానం అన్న వివేక్

  టిఆర్ఎస్ ను వీడిన తర్వాత నిన్న మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న వివేక్ ఇప్పుడు గట్టిగానే నోరు విప్పారు. కేటీఆర్ కోసం హరీష్ రావు గొంతు కోశారని వివేక్ వ్యాఖ్యలు చేశారు.మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్న ఆయన కేసీఆర్ వైఖరి తనకు బాగా తెలుసన్నారు. నమ్మించి గొంతు కోయటం , మోసం చెయ్యటం ఆయన నైజమని పేర్కొన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తోపాటు పలువురు స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీలో చేరిన సందర్భంగా వివేక్‌ మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడవడంలో కేసీఆరే కీలకపాత్ర పోషించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

  కొడుకును ముఖ్యమంత్రి చెయ్యాలని హరీష్ రావు గొంతు కోశారని వివేక్ ఆగ్రహం

  కొడుకును ముఖ్యమంత్రి చెయ్యాలని హరీష్ రావు గొంతు కోశారని వివేక్ ఆగ్రహం

  కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన హరీశ్‌రావు గొంతు కోశారని ఆరోపించిన వివేక్ టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదంటూ మండిపడ్డారు. కెసిఆర్ కు బుద్ధి చెప్పాలంటే బిజెపిలో చేరాలని వివేక్ పిలుపునిచ్చారు.

  ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వివేక్ కు మద్దతుగా చాలామంది బిజెపిలో చేరడానికి సన్నద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి నేనని వివేక్ పేర్కొన్నారు.

  కాంగ్రెస్ , టీఆర్ఎస్ లపై బీజేపీ నేతల ఆగ్రహం

  కాంగ్రెస్ , టీఆర్ఎస్ లపై బీజేపీ నేతల ఆగ్రహం

  బిజెపి లోకి భారీగా చేరికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడారు. కేటీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోడుదొంగల్లా బీజేపీపై రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి బినామీగా, తోక పార్టీగా మారిందని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్న లక్ష్మణ్ ఎక్కడ బిజెపి బలపడుతుందోననే భయంతో తెలంగాణ ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేకున్నా తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సంపూర్ణంగా మద్దతిచ్చిందని గుర్తుచేశారు.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here