విశాఖకు దక్షిణాఫ్రికా జట్టు: గురువారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌తో వార్మప్ మ్యాచ్

0
2


హైదరాబాద్: మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు గాను దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో మూడు టీ20ల సిరిస్ ముగిసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా… ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ 1-1తో సమం అయింది.

ఇప్పుడు టెస్టు సిరిస్ వంతు వచ్చింది. ఆక్టోబర్ 2 నుంచి జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. దీంతో మూడో టీ20 ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా జట్టు విశాఖపట్నానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టుతో పాటు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టు కూడా విశాఖకు చేరుకుంది.

వైరల్ ఫొటో.. బికినీలో పిచ్చెక్కిస్తున్న ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. గురువారం నుంచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.

విశాఖకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఘన స్వాగతం లభించింది. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుతో వార్మప్ మ్యాచ్ అనంతరం భారత్‌-దక్షిణాఫ్రికా జట్లు విశాఖపట్నం వేదికగా అక్టోబర్‌ 2న తొలి టెస్టు మ్యాచ్‌లో తలపడతాయి. 2015లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో చేజార్చుకుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here