విశాల సాహితీ పురస్కారం ప్రదానం

0
3


విశాల సాహితీ పురస్కారం ప్రదానం

త్రివేణికి జ్ఞాపికను బహూకరిస్తున్న భాషా పండితులు

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు విభాగం సహాయ ఆచార్యురాలు డా.వంగరి త్రివేణికి బీఎస్‌ రాములు ‘విశాల సాహితీ’ పురస్కారం అందజేశారు. ఆధునిక కవి, సామాజిక తత్వవేత్త, రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు జన్మదినోత్సవం సందర్భంగా విశాల సాహిత్య అకాడమీ వారు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ మహర్షి బాదరాయణ వ్యాస్‌ సమ్మాన్‌ రాష్ట్రపతి పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

గిరిజన శక్తి మహాసభను విజయవంతం చేయాలి

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సెప్టెంబరు 8న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే గిరిజన శక్తి ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని సంఘం యూనివర్సిటీ నాయకులు మోహన్‌, ఉపేందర్‌ కోరారు. సభ గోడ ప్రతులను వర్సిటీలో శనివారం ఆవిష్కరించారు. తీజ్‌, సీత్ల, సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వ సెలవుతో పాటు పలు డిమాండ్లతో చేపట్టే సభకు పార్టీలకు అతీతంగా గిరిజనులు హాజరుకావాలని వారు కోరారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, మోతీరాం, గిరిజ, కావేరి పాల్గొన్నారు.

ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివి కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో నిర్వహించిన ఓయూ సీపీజీఈటీ-2019 ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారంతో ముగిసింది. చివరి రోజు హిందీ, ఉర్దూ, జియాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్‌, సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎం.ఎల్‌ఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, ఎంబీఏ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 330 మంది హాజరైనట్లు అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. మొదటి దశలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు మార్చుకోవచ్చని, 29న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సెప్టెంబరు 3న కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here