విహరంలో విషాదం : నది ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు, ఒకరి మృతి

0
1


విహరంలో విషాదం : నది ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు, ఒకరి మృతి

కడప : సరదా కోసం విహరానికి వెళ్లే విషాదం నింపింది. కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబంతో కలిసి కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి ఆడుకుంటుండగా .. నది ప్రవాహం వారి ఇంటి దీపాలను ఆర్పివేసింది. జాఫర్ హుస్సేన్ మృతదేహన్ని వెలికితీశారు. చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతుంది. జాఫర్ ఇంట్లో విషాద వదనం నెలకొంది. సరదా కోసం వెళ్తే తిరిగిరాని లోకాలకు వెళ్లారని రోదిస్తున్నారు.

కడప జిల్లా కమలాపురం దర్గా వీధికి చెందిన జాఫర్ హుస్సేన్ కూలీ పనులు చేస్తుంటాడు. ఇతనికి ఇర్పాన్, జకీర్, షాహీద్ అనే పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా కలిసి మంగళవారం సరదా కోసం కుందూ నదీ వద్దకెళ్లారు. అక్కడే మధ్యాహ్నం భోజనం కూడా చేశారు. అయితే అప్పటికే వరదనీరు పోటెత్తుతుంది. ఆ ప్రవాహం వారి కుటుంబాన్ని కబలించింది.

సరదాగా ఆడుకుంటుండగా వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీశైలం నుంచి కుందూ నదికి భారీగా వరదనీరు వచ్చింది. సాయంత్రం సమయంలో ప్రవాహం మరింత ఉధృతమైంది. దీంతో వారు నదిలో ఆడుకుంటుండగా .. ఒక్కసారిలో ప్లో పెరిగింది. వారికి ఈత వచ్చిన ప్రయోజనం లేకపోయింది. ఆ ప్రవాహ వేగానికి వారు కొట్టుకుపోయారు. తర్వాత గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. జాఫర్ హుస్సేన్ మృతదేహన్ని వెలికితీశారు. చిన్నారుల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విసృతంగా గాలిస్తున్నారు. సరదా కోసం నది ఒడ్డుకు చేరితే తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని వారు రోదిస్తున్నారు. మరో చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here