వీడియో: బొద్దింకలను చంపబోయి.. మూడు కార్లకు నిప్పు!

0
1


మీ ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే ఏం చేస్తారు? ఏదైనా క్రిమీసంహారకాన్ని స్ప్రే చేసి, వాటి బెడద తొలగించుకుంటారు. చైనాకు చెందిన ఆ వ్యక్తి కూడా అదే చేశాడు. అయితే, ఆ మందు మరింత ప్రభావంగా పనిచేయాలనే ఉద్దేశంతో దానికి నిప్పు పెట్టాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడు కార్లు బుగ్గయ్యాయి.

Also Read: వీడియో: బొద్దింకలకు బాంబు పెట్టాడు.. చివరికి ఊహించని ట్విస్ట్!

క్యాన్‌జౌ నగరానికి చెందిన వంట గదిలో బొద్దింకల బెడద ఎక్కువ కావడంతో విసిగిపోయాడు. దీంతో మండే స్వభావం గల మందును తీసుకొచ్చి వంటగదిలో పిచికారీ చేశాడు. ఆ తర్వాత దానికి నిప్పు పెట్టాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున్న లేచాయి. అతడు చల్లిన క్రిమీసంహారకం రోడ్డు మీదకు కూడా చేరింది.

Also Read: అతడి చెవిలో పదుల సంఖ్యలో బొద్దింకలు.. ఏకంగా ఫ్యామిలీ పెట్టేశాయి!

దీంతో మంటలు రోడ్డు మీదకు వ్యాపించాయి. అక్కడ పార్కు చేసి ఉంచిన మూడు కార్లకు పాకాయి. ఈ ఘటనలో బొద్దింకలు చనిపోయాయో లేదో తెలియదు గానీ.. కార్లు కాలిపోవడం వల్ల రూ.31 లక్షలు నష్టం వాటిల్లింది. ఈ ఘటన ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే విధంగా గార్డెన్‌లో బొద్దింకలకు నిప్పుపెట్టాడు. దీంతో భారీ విధ్వంసం జరిగింది.

వీడియో:Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here