వీడియో: వరద బాధితుల ఆర్థిక సహాయంలో వైఎస్ జగన్ మానవీయం: రెట్టింపు పరిహారం చెల్లింపు!

0
1


వీడియో: వరద బాధితుల ఆర్థిక సహాయంలో వైఎస్ జగన్ మానవీయం: రెట్టింపు పరిహారం చెల్లింపు!

అమరావతి: రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు తోడు.. గోదావరి నది పోటెత్తడం వల్ల ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చోటు చేసుకోకూడదని సూచించారు. సాధారణంగా వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు 5000 రూపాయల చొప్పన నష్ట పరిహారాన్ని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని వైఎస్ జగన్ బ్రేక్ చేశారు. రెట్టింపు పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. సుమారు గంటపాటు వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదనీటిలో మునిగిన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.ఉప ముఖ్యమంత్రులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సంక్షేమశాఖ మంత్రి పినెపె విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఈ సందర్భంలో ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

అనంతరం- ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు ముఖ్యమంత్రి. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అక్కడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యాలయంలో అప్పటికప్పుడే సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రభావానికి గురైన కుటుంబాలకు వెంటనే అన్ని రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు ఆహార సదుపాయాన్ని కల్పించాలని అన్నారు. ఒక్కో కుటుంబానికి అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పారు. ఇళ్లు, పంట నష్టపోయిన వారికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా అదనంగా మరో 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తోన్న వారిలో 70 శాతం మంది గిరిజనులు ఉన్నారని, వారంతా ప్రస్తుతం ఉపాధి కోల్పోయారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా 5000 రూపాయలను అందించాలని అన్నారు. మానవతా దృక్పథంతో గిరిజనులను ఆదుకోవాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం మాత్రమే కాకుండా ఉచితంగా విత్తనాలను కూడా పంపిణీ చేయాలని వైఎస్ జగన్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టుకోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన రైతులకు కూడా ఈ పరిహారంతో పాటు సబ్సిడీపై విత్తనాలు అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారిపై ఎలాంటి వివక్ష చూపకూడదని స్పష్టం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here