వీడియో వైరల్ : ఓ హోటల్‌లో గెరిటె తిప్పి సర్వర్లుగా మారిన ధనవంతులు

0
21
నిరంతరం బిజీగా ఉండే ధనవంతులు గేట్స్, బఫెట్

 

నిరంతరం బిజీగా ఉండే ధనవంతులు గేట్స్, బఫెట్

మైక్రోసాఫ్ట్ కంపెనీ.. బర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ.. ఈ సంస్థలు వీటి అధినేతలు తెలియని వారుండరు. వారే బిల్ గేట్స్ మరియు వారెన్ బఫెట్. ఎప్పుడూ బిజీగా ఉండేవారు. వారి జీవితంలో ఒక్క క్షణం కూడా తీరిక ఉండని వీరు తీరిక చేసుకుని ఇద్దరూ ఓ ఐస్‌క్రీం స్టోర్‌కు వెళ్లారు. ఒమాహాలో ఉండే ఓ ఫుడ్ స్టోర్‌కు వెళ్లారు ఇద్దరు. అక్కడ కస్టమర్లకు చల్లటి ఐస్‌క్రీం మరియు ఇతర ఫుడ్ ఐటెమ్స్ వడ్డించారు.

సరదాగా భోజనం చేద్దామని బయటకు వెళ్లిన గేట్స్, బఫెట్

బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక సమావేశం అయ్యాక ఇద్దరు నేతలు తాము భోజనం చేయాలని భావించారు. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా ఎక్కడైనా బయట రెస్టారెంట్‌లో భోజనం చేద్దామని భావించారు. అనుకున్నదే తడవుగా ఒక ఐస్‌క్రీం స్టోర్‌కు వెళ్లారు. అందులో రెస్టారెంటు కూడా ఉంది. ఇక ఒక్కసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనికులు తమ హోటల్‌కు రావడంతో అక్కడి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అంతేకాదు వారు వేసుకునే యాప్రన్ తీసుకుని బిల్‌గేట్స్, వారెన్ బఫెట్‌లు ధరించగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కస్టమర్లకు ఐస్‌క్రీం వడ్డించిన బఫెట్ , బిల్ గేట్స్

ఇక యాప్రన్‌లు ధరించి రంగంలోకి దిగారు బిల్ గేట్స్, బఫెట్‌లు. సర్వింగ్ చేయడమే కాదు అక్కడ కొన్ని ఐటెమ్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకుని గెరిటె తిప్పారు. ఆ రెస్టారెంటులో ఫేమస్ ఫుడ్ ఐటెం కూడా ఎలా చేయాలో నేర్చుకున్నారు. చాక్లెట్‌లతో ఈ స్వీట్‌ను తయారు చేశారు. మొత్తానికి బఫెట్ చేసిన ఈ వంటకం కాస్త తేడా కొట్టినప్పటికీ ఆయన చేసిన ప్రయత్నం మాత్రం అక్కడి సిబ్బందిని ఆకట్టుకుంది. ఈ వీడియోను బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. తన విజయరహస్యాన్ని బఫెట్ షేర్ చేశారంటూ కొందరు నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ వయసులో ఇంత సంపాదించి కూడా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనకు సలాం కొడుతున్నామని మరికొందరు నెటిజెన్లు కామెంట్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here