వెలవెలబోయిన బీసీ గురుకులం

0
0


వెలవెలబోయిన బీసీ గురుకులం


విద్యార్థులు లేక ఖాళీగా దర్శనమిస్తున్న తరగతి గది

ఎర్రపహాడ్‌(తాడ్వాయి), న్యూస్‌టుడే: ఎర్రపహాడ్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాల సోమవారం విద్యార్థులు లేక వెలవెల బోయింది. ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తమకు మౌలిక వసతులు కల్పిస్తే తప్ప పాఠశాలకు తిరిగి వచ్చే ది లేదని వారు తల్లిడండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గురుకులంలో 343 మంది విద్యార్థులకు సరైన వసతుల్లేవు. తరగతి గదుల్లో కూర్చోడానికి, వసతి గృహంలో పడుకోవడానికి స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల నుంచి వసతులు కల్పిస్తామంటూ ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గతంలో పాఠశాల సమస్యలపై జిల్లా పాలనాధికారితోపాటు, బీసీ గురుకులం రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులు చూడలేకనే ఇంటికి తీసుకెళ్లుతున్నట్లు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. వసతులు కల్పిస్తేనే తిరిగి పంపిస్తామన్నారు. విద్యార్థులు లేక పాఠాలు బోధించడం లేదని పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ సునీత అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here