వెహికిల్, హోమ్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలపై SBI కీలక నిర్ణయం

0
2


వెహికిల్, హోమ్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలపై SBI కీలక నిర్ణయం

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంఎస్ఎంఈ, హోమ్ లోన్, ఆటో లోన్, రిటైల్ విభాగాల్లో ఫ్లోటింగ్ రుణాలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి రెపో రేటునే వెలుపలి బెంచ్ మార్క్‌గా పరిగణించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది.

వచ్చే నెల నుంచి దేశంలోని బ్యాంకులన్నీ పర్సనల్, రిటైల్ విభాగాల్లో ఫ్లోటింగ్‌ రేటు రుణాలకు వెలుపలి బెంచ్‌మార్క్‌ను అనుసరించాలని ఈ నెల 4వ తేదీన ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు కొన్ని ప్రామాణికాలు సూచించింది. ఆర్బీఐ సూచించిన ప్రామాణిక బెంచ్ మార్క్‌ల్లో రెపోరేటుతోనే తాము మిడ్ సైజ్ రుణాల్ని అనుసంధానం చేయాలని నిర్ణయించినట్టు ఎస్బీఐ తెలిపింది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి వడ్డీ రేటు రుణాలను రెపో రేటు ఆధారితంగా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులను ఇటీవల ఆదేశించింది. దీంతో వచ్చే నెల ప్రారంభం నుంచి హోమ్ లోన్, వెహికిల్ లోన్, మధ్య-చిన్న-సూక్ష్మస్థాయి (MSME) సంస్థకు ఇచ్చే రుణాలను బ్యాంకులు రెపో రేటు ఆధారంగా ఇవ్వాలి.

లేదా 3/6 నెలల ట్రెజరీ బిల్లు రాబడి లేదా ఫైనాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించిన ప్రామాణిక రేటు ఆధారంగా జారీ చేయాలి. రెపో రేటు ఆధారంగా ఇస్తే రెపో తగ్గినప్పుడు వడ్డీ భారం తగ్గుతుంది. ఇది కస్టమర్లకు ప్రయోజనం. ఇటీవల వరుసగా రెపో రేటు తగ్గింది.

రుణాల వడ్డీ రేట్లను రెపో రేటు సహా ఇతర బాహ్య ప్రామాణికాలతో అనుసంధానం చేయాలని బ్యాంకర్లను ఆర్బీఐ దాదాపు ఇరవై రోజుల క్రితం ఆదేశించింది. రెపో రేటు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌నూ విడుదల చేసింది. ఇందులో గృహ, వ్యక్తిగత, వాహన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (MSME)లకు రుణలభ్యతని సులభతరం చేయాలని సూచించింది. తద్వారా వడ్డీ భారం తగ్గించాలని అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఉన్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (MCLR) నిబంధనావళి ఆశించిన సంతృప్తికరంగా లేదని ఆర్బీఐ పేర్కొంది. కాబట్టి రెపో రేటుకు లింక్ చేయాలని తెలిపింది. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ను అనుసరించాలని సూచించింది. కీలక వడ్డీ రేట్ల కోత ప్రయోజనాన్ని ఎప్పటికప్పుడు కస్టమర్లకు సత్వరం బదలీ చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

ఒక రుణ విభాగానికి ఒక బ్యాంకు కచ్చితమైన ఓ ప్రామాణిక రేటును ఆధారం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. అది వేర్వేరుగా ఉండవద్దని తెలిపింది. ఏ ప్రమాణాన్ని ప్రమాణంగా తీసుకోవాలన్నది బ్యాంకులు నిర్ణయించుకోవాలని సూచించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here